నల్లని పెదాలు పింక్ గా అయ్యే టిప్స్?

Purushottham Vinay
నల్లగా మారిన పెదాలను నేచురల్ గా బేబీ పింక్ కలర్ లోకి మనం తీసుకు రావచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పెదాలను బాగా మెరిపించడంలో నిమ్మ రసం – తేనే బాగా హెల్ప్ అవుతాయి.అందుకే వీటిని సమ పాల్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పెదాలపై మృదువుగా అప్లై చేయండి. ఇక ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేస్తే సరిపోతుంది. నిమ్మ రసం పెదాలపై ఉండే మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. ఇంకా అలాగే తేనే సాఫ్ట్ గా, తేమ ఉండేలా చేస్తుంది. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగ పడుతుంది.మీ పెదాలు గులాభి రంగులో అందంగా కనిపించాలంటే.. గులాభీ రేకుల పేస్ట్ ని మీ పెదాలపై రాయండి. ఈ పేస్ట్ ని ఓ 15 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ వలన మీ పెదాలు కలర్ మారడమే కాకుండా.. తేమగా ఉంటాయి. గులాభి రేకులు పిగ్మంటేషన్ ను తొలగించేందుకు కూడా బాగా సహాయం చేస్తుంది.అలాగే కీరా దోశ కూడా పెదాల కలర్ మార్చేందుకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది.



మీరు కీరాలను ముక్కలుగా కట్ చేసి పెదాలపై 10 నుంచి 15 నిమిషాలు పాటు ఉంచితే సరిపోతుంది.ఎందుకంటే కీరాలో ఉండే నేచురల్ బ్లీచింగ్ గుణాలు.. పెదాలపై ఉన్న పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.అలాగే ఆలీవ్ ఆయిల్ లో కొంచెంద పంచదార కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై రాసి చాలా సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు బాగా క్లీన్ అవుతాయి. పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఈజీగా తొలగుతాయి. ఈ స్క్రబ్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే పెదాలు రంగు ఈజీగా మారతాయి.ఇంకా అలాగే కలబంద గుజ్జులో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కలబందతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా మీరు రెట్టింపు చేసుకోవచ్చు. కలబంద గుజ్జు పెదాల రంగు మార్చడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త అలోవెరా గుజ్జుని తీసుకుని దానిని పెదాలపై వేసి కాసేపు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే.. పెదాలపై ఉండే నలుపు ఈజీగా పోయి పెదాలు లేత గులాభి రంగులోకి మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: