ముఖం అందంగా ఉండాలంటే కేవలం ఖరీదైన క్రీములు, మాయిశ్చ రైజర్లు ఇంకా క్లెన్సర్లు వాడితే సరిపోదు. దానికి తగినట్టుగా మీ ఇంట్లో, ఒంట్లో కూడా ఖచ్చితంగా మార్పులు ఉండాలి.మీరు జంక్ ఫుడ్ ని తీసుకుంటే దాని వల్ల బరువు పెరగడం, ఊబకాయం, చర్మంలో ముడతలు రావడం ఇంకా గ్లో లేకుండా పాలిపోయి ఉండం వంటివి కనిపిస్తాయి. అదే మీరు ఉదయం వ్యాయామం చేస్తూ సరైన డైట్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా మనం సొంతం అవుతుంది.అయితే ఈ విషయం పక్కకు పెడితే.. ముఖ్యంగా మనం ముఖం పింపుల్స్, దురద వంటివి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం పడుకునే బెడ్ కూడా ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లో కవర్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంగా కూడా మనం నిద్రపోయేది ఆ పిల్లో కవర్స్ మీదనే. రాత్రంతా కూడా ముఖం దిండుపైనే ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో మాత్రం చర్మం ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లో కవర్స్ ని వారానికోసారి ఖచ్చితంగా శుభ్ర పరుస్తూ ఉండాలి.
మనం ఎంత శుభ్ర పరిచినా కూడా రోజూ ఎంతో కొంత దుమ్ము, ధూళి పిల్లో కవర్స్ చేరుతూనే ఉంటుంది. ఇంకా అంతే కాకుండా చాలా మంది నైట్ నూనె రాసుకుని పడుకుంటారు. ఈ నూనె అంతా కూడా పిల్లో కవర్స్ కి అంటుకుని ఉంటుంది.అంతేకాకుండా నైట్ మనం రాసే క్రీములు ఇంకా లోషన్స్ కూడా దిండుకు చేరుతాయి. ఇలాంటి పనుల వలన ముఖంపై పింపుల్స్ లేదా చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దిండు క్లాత్స్ ను ఖచ్చితంగా అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి.చాలా మంది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వలన చర్మ రంధ్రాలకు పెద్ద సమస్యగా ఉంటుంది. ఇంకా స్కిన్ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం కూడా ఉంది.ఇక మీరు ఉపయోగిస్తున్న ఫాబ్రిక్ రకాన్ని బట్టి కూడా పలు సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు కాటన్ వంటి ఫాబ్రిక్ ను యూజన్ చేయడం వల్ల జుట్టు చివర్లు విరిగిపోవడానికి ఖచ్చితంగా కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫాబ్రిక్ ను ఎంచుకోవాలి.