పళ్ళని అందంగా ఆరోగ్యంగా మార్చే టిప్?

frame పళ్ళని అందంగా ఆరోగ్యంగా మార్చే టిప్?

Purushottham Vinay
మన అందాన్ని ఇంకా ఎక్కువ చెయ్యడంలో నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నవ్వు బాగుండాలంటే పళ్ళు బాగుండాలి.మన పళ్ళు ఆరోగ్యంగా ఇంకా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలి.  మనం ఆహారాన్ని తినేటప్పుడు మన దంతాలపై, దంతాల సందుల్లో చక్కెరలు ఇంకా ఆహార పదార్థాలు పేరుకుపోతాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాతో కలిసి పళ్లపై ఉండే ఎనామిల్ ను ఈజీగా దెబ్బతిస్తాయి. అందుకే నీటిని ఎక్కువగా తాగడం వల్ల దంతాలపై ఉండే బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది. దంతాలపై చక్కెరలు ఇంకా ఆహార పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి.అందువల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా అలాగే పాలను తీసుకోవడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలను తీసుకోవడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ చాలా బలంగా తయారవుతుంది. ఇంకా అలాగే పాలల్లో ఉండే క్యాల్షియం దంతాలను ధృడంగా చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇంకా అదే విధంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.



ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ దంతాలపై పేరుకుపోయిన పాచిని ఇంకా క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో దంతాల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే పంచదార లేని చూయింగ్ గమ్ లను బాగా నమిలి ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు బాగా శుభ్రపడతాయి.ఇంకా అలాగే వంటల్లో కొబ్బరి నూనెను వాడడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాలు పుచ్చిపోకుండా కాపాడడంలో ఇంకా అలాగే చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె మనకు ఎంతో దోహదపడుతుంది.ఇంకా అలాగే చక్కటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ రెండుసార్లు దంతాలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. నైట్ నిద్ర పోయే ముందు దంతాల మధ్యలో ఆహారం ఏమి లేకుండా ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి.బ్రష్ తో కాకుండా వీలైతే వేప పుల్లతో పళ్ళు తోముకోవాలి.అలాగే చూయింగ్ గమ్స్ ఎక్కువగా నమ్ములుతూ ఉండాలి. ఇక ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మనం మన దంతాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: