హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టే సింపుల్ టిప్?

Purushottham Vinay
ఒక చిన్న సింపుల్ టిప్ ని వాడడం వల్ల మనం చాలా ఈజీగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా జుట్టు రాలే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. అలాగే వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. కొంతమంది వారి జుట్టు ఒత్తుగా పెరగాలని చేయని ప్రయత్నం అంటూ ఉండదు.జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే చాలా రకాల నూనెలను, షాంపులను వాడుతూ ఉంటారు.కానీ వారికి ఎటువంటి ఫలితం లేక చివరికి నిరాశే మిగులుతుంది. జుట్టు విపరీతంగా రాలే వారు ఇప్పుడు చెప్పే టిప్ ని ట్రై చెయ్యడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ టిప్ ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ టిప్ ట్రై చెయ్యడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ టిప్ ని వాడడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ఆ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం ఒక కప్పు పెరుగును, ఒక టీ స్పూన్ కాళోంజి విత్తనాల పొడిని ఇంకా 2 టీ స్పూన్ల ఆముదాన్ని వాడాల్సి ఉంటుంది. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి వాడిన ప్రతి పదార్థం కూడా చాలా ఔషధ గుణాలను, పోషకాలను కలిగి ఉంటాయి.ఇవి మన జుట్టు కుదుళ్లకు మంచి బలాన్ని చేకూర్చి ఇంకా జుట్టు రాలడం తగ్గించి అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ చక్కటి టిప్ ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో కాళోంజి విత్తనాల పొడిని ఇంకా ఆముదం నూనెను వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇక ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలన్నీ కూడా ఈజీగా అందుతాయి. ఇంకా జుట్టు కుదుళ్లు కూడా బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల మనం చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: