అన్వాంటెడ్ హెయర్ తో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు మీకోసమే..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామందికి హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్,ఆహార అలవాట్లు,పొల్యూషన్ కారణంగా మొహంపై మరియు ఇతర భాగాలపై అన్ వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది.అలాంటివారు పదిమందిలోకి కలవాలన్నా కూడా తెగ ఇబ్బంది పడుతూ వుంటారు.పోనీ అవి తగ్గించుకుందామా అని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేక చాలా ఫీల్ అవుతువుంటారు కూడా.అలాంటి వారికి మన ఇంట్లో సహజంగా దొరికే కొన్ని పదార్థాలతో మొహం పై స్క్రబ్ చేసుకోవడం వల్ల,అన్ వాంటెడ్ హెయిర్ సులభంగా తగ్గిపోతుంది.ఎలాంటి పదార్థాలు అన్వాంటెడ్ హెయిర్ తగ్గిస్తాయో,మనము తెలుసుకుందాం పదండి..

నిమ్మరసం,చక్కెర..

ఈ స్క్రబ్ కోసం ఒక స్పూన్ చక్కర,మూడు లేదా నాలుగు చుక్కల నిమ్మరసం వేసి,బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని అన్వెంటెడ్ హెయిర్ ఎక్కడ ఉందో,అక్కడ అంతా అప్లై చేసి,బాగా మర్దనా చేయాలి.ఇలా పది నిమిషాలు ఆరిన తర్వాత,పేష్ వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల,మన శర్మంలోని హెయిర్ ఫాలికల్స్ నశించి,అన్వాంటెడ్ హెయిర్ తగ్గిపోతుంది.

కాఫీగింజలు..

అన్వెంటెడ్ హెయిర్ సులభంగా తొలగించుకోవడానికి కాఫీగింజల స్క్రబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మూడు స్పూన్ల కాఫీగింజలు తీసుకొని, తగినంత ఆలివ్ ఆయిల్ వేసి మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అన్వెంటెడ్ హెయిర్ పైన రాసి మసాజ్ చేసి,అరగంట సేపు ఆరనివ్వాలి.ఇలా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరి. ఈ కాఫీ గింజల్లోని కెఫెన్ అన్వాంటెడ్ హెయిర్ ని తొలగించడానికి సహాయపడుతుంది.

 టమాట..

 దీనికోసం ఒక టమాట తీసుకొని,ఒక స్పూన్ పింక్ సాల్ట్ కలిపి,పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.హెయిర్ పైన రాసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఇలా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. దానితో అన్వాంటెడ్ హెయిర్ తొందరగా రాలిపోతుంది.

 బొప్పాయి..

ఈ స్క్రబ్  కోసం రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జు,ఒక స్పూన్ శనగపిండి,అరస్పూన్ పసుపు వేసి మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమం ఆన్ వాంటెడ్ హెయిర్ని పోగొట్టడమే కాకుండా,దాని తాలూకు మచ్చల్ని కూడా తొలగిస్తుంది.

 బ్రౌన్ షుగర్..

దీనికోసం కోసం ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ తీసుకొని, అందులో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు వేసి,బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని అన్ వాంటెడ్ హెయిర్ పైన అప్లై చేయడం వల్ల,దానిని తొందరగా తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: