తెల్ల జుట్టు సమస్యని తగ్గించే నూనెలు ఇవే?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మందికి కూడా చాలా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. జీవనశైలి మార్పులూ, పోషకాల లేమి ఇంకా మెలనిన్‌ తక్కువగా ఉండటం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పుడు చెప్పబోయే నూనెలు చాలా బాగా ఉపయోగపడతాయి.భృంగరాజ్‌ ఆయిల్‌ అనేది చాలా మంచిది.దీనిలో మెలనిన్‌ ఉత్పత్తికి దోహదపడే బయోయాక్టివ్‌ సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇవి మీ జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తాయి.భృంగరాజ్‌ నూనెను తలకు పట్టించి ఒక గంట తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి.అలాగే ఈ పొడికి నీటిని కలిపి పేస్ట్‌లాగా తయారుచేసి కూడా వాడుకోవచ్చు.ఇంకా అలాగే కలబంద గుజ్జులో క్యాల్షియం, సెలెనియం, జింక్‌, క్రోమియం వంటి పోషకాలు తల నెరవకుండా సహాయపడతాయి.ఇవన్నీ కూడా కలబంద గుజ్జులో పుష్కలంగా ఉంటాయి. ఈ గుజ్జుకి హెన్నా, కాఫీ, టీ డికాక్షన్‌లు కలిపి తలకు రాస్తే ఈ సమస్య క్రమంగా సమస్య తగ్గుతుంది.


అలాగే కరివేపాకు నూనెలో బయోయాక్టివ్‌ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జట్టు సంరక్షణకు చాలా బాగా సహాయపడతాయి.అయితే ఇందుకు కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి బాగా మరిగించాలి. అది చల్లారాక వడపోసి దాన్ని మాడు నుంచి కుదుళ్ల దాకా పట్టించాలి.ఒక గంట తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక జుట్టుకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా తెల్లవెంట్రుకలు వస్తుంటాయి. అందుకే తలకు కొబ్బరి నూనెను రోజూ పట్టించాలి.ఇంకా అలాగే ఉసిరి కాయల్లో యాంటాసిడ్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు నెరసిపోకుండా బాగా కాపాడతాయి. ఇంకా పెరుగుదలకూ సహాయపడతాయి. ఉసిరిని చిన్న ముక్కలుగా కోసి దానిని గ్లాసు నీటిలో వేసి మరిగించాలి.అది సగం నీరయ్యాక దించి చల్లారనిచ్చి మాడుకు బాగా పట్టించాలి.తరువాత ఒక అరగంట ఆగి మాములు నీళ్లతో తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: