ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారింది.ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. జట్టు రాలిపోవడానికి చాలా రకాలు కారణాలు ఉంటాయి.ఒత్తిడి, నిద్ర లేకపోవడం, సరైన జీవనశైలిని అలవరచుకోలేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. విటమిన్ సి, జింక్, ఐరన్.. ఇవి ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా వరకు జట్టు రాలిపోవడాన్ని తగ్గించవచ్చు.ఉసిరి, నారింజ, బత్తాయి, నిమ్మ ఇంకా జామ వంటి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సీపుడ్, మాంసం, వేరుశెనగలు ఇంకా డార్క్ చాక్లెట్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఆకు కూరలు, గుడ్లు, డ్రైప్రూట్స్, జీడిపప్పు ఇంకా సీపుడ్స్ లాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పుడ్ తినడం వల్ల మీ శరీరానికి మంచి పోషకాలు అంది మీ జుట్టు ఎప్పటికి రాలిపోకుండా ఉంటుంది.
ఇంకా అంతేకాకుండా మంచి ఒత్తైనా జుట్టు రావడంతోపాటు కుదుళ్లు బాగా బలపడతాయి.ఈ ఆహారం తింటూనే వారంలో రెండు సార్లు తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ పాల్ ఈజీగా తగ్గుతుంది. ఒక వేళ ఇంకా జుట్టు రాలుతుంటే ఖచ్చితంగా ధైరాయిడ్ టెస్టు చేయించుకోండి. వైద్యుల సలహాతో మందులు ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ధైరాక్సిన్ హార్మోన్ అసమతుల్యత వల్ల ఈ సమస్య మెుదలవుతుంది. అందుకే మీ డైట్ లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చూసుకోండి.మీ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మెంతులు ఖచ్చితంగా కీలకపాత్ర పోషిస్తాయి. ఈ మెంతి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే నిమ్మరసం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల కూడా హెయిర్ పాల్ సమస్య తగ్గుతుంది.