మొటిమలు శాశ్వతంగా మాయం అయ్యే టిప్?

Purushottham Vinay
తమలపాకుల వల్ల మన చర్మానికి చాలా ప్రయోజనాలు వున్నాయి. మొటిమలు, బ్రేకౌట్స్ ఇంకా డార్క్ స్పాట్స్ వంటి అనేక చర్మ సమస్యలను దూరం చేయడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.  తమలపాకు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఇంకా దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. చర్మ సమస్యలతో బాగా బాధపడే వారికి ఇది మంచి హోం రెమెడీ అని చెప్పవచ్చు.కొన్ని తమలపాకులను తీసుకొని వాటిని నీళ్లలో వేసి మరిగించి తరువాత పచ్చివాసన వచ్చాక ఆ నీటిని వడకట్టాలి. మీరు ప్రతిసారీ మీ ముఖం కడగడానికి ఈ నీటిని ఖచ్చితంగా ఉపయోగించండి. ఇది చర్మ సమస్యలను చాలా ఈజీగా నివారిస్తుంది. ఇంకా అలాగే మీ చర్మంపై ఉండే అన్ని బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.కాబట్టి మీకు ఎలాంటి చర్మ సమస్య లేకపోయినా ఈ తమలపాకులను ఉపయోగించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని ఈజీగా పెంపొందించుకోవచ్చు. ఇంకా చర్మ సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఇంకా అలాగే తమలపాకులను తీసుకొని వాటిని వేడి నీటిలో 15-20 నిమిషాలు మరిగించి ఆ తరువాత తలస్నానం చేయాలి. దురద ఇంకా చర్మం ఇన్ఫెక్షన్ లేదా దద్దుర్లు ఉన్నవారికి ఇది ఖచ్చితంగా చాలా మంచిది.ఎందుకంటే ఈ మందు కలిపిన నీటిలో స్నానం చేయడం వల్ల చికాకు పడిన చర్మానికి మంచి ఉపశమనం కలుగుతుంది.


అలాగే కొన్ని తమలపాకులను తీసుకుని వాటిని గ్రైండ్ చేసి,తరువాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేయండి. ఇక మీరు పెరుగు, ఫుల్లర్స్ ఎర్త్ లేదా మీ చర్మానికి సరిపోయే ఏదైనా ఇతర పదార్ధాన్ని కూడా కలపవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మీ ముఖం ఈజీగా సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.దీనికి ప్రత్యామ్నాయంగా, మీరు తమలపాకులను పొడిగా చేసి వాటిని స్టోర్ చేయవచ్చు. దీన్ని సులభంగా గాలి చొరబడని పాత్రలో స్టోర్ చేసుకుని మీకు అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు.చర్మానికి తమలపాకు అనేది ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.ఇది చర్మంలో దురద ఇంకా నొప్పిని తగ్గిస్తుంది. ఈ తమలపాకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను ఈజీగా చంపుతాయి.కాబట్టి ఈ తమలపాకును మొటిమల నివారణకు కూడా ఉపయోగించవచ్చు. తమలపాకులను వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే మొటిమలు ఖచ్చితంగా శాశ్వతంగా ఈజీగా నయం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: