ఈ నూనెతో జుట్టు సమస్యలు ఈజీగా మాయం?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, జుట్టు తెగడం, జుట్టు చిట్లడం ఇంకా జుట్టు తెల్లబడడం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు.జుట్టు సమస్యల బారిన పడడానికి కారణాలేవైనప్పటికి జుట్టు అందంగా ఉంటేనే మనం కూడా అందంగా కనిపిస్తాము. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్రాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే అన్ని రకాల నూనెలను కూడా వాడుతూ ఉంటారు. కానీ ఎలాంటి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం రెండే రెండు పదార్థాలతో ఇంట్లోనే నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల అందమైన ఇంకా ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.మనం ఒక కప్పు ఆవ నూనెను ఇంకా 4 టీ స్పూన్ల మెంతులను ఉపయోగించాల్సి ఉంటుంది. జుట్టు సమస్యలను తొలగించడంలో ఆవ నూనె ఇంకా మెంతులు చాలా చక్కగా పని చేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, ఇన్ ప్లామేషన్ ను తగ్గించి తలలో దురద వంటి వాటిని తగ్గించడంలో, జుట్టును నల్లగా మార్చడంలో ఆవ నూనె ఇంకా మెంతులు ఉపయోగపడతాయి.


ఇక జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇందుకోసం ముందుగా మెంతులను పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని అందులో మెంతుల పొడి వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక నీటి నుండి గిన్నెను బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి. తరువాత ఈ నూనెను వడకట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను తాజాగా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు లేదా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను తగిన మొత్తంలో తీసుకుని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని పొద్దున్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలన్నీ ఈజీగా తగ్గు ముఖం పడతాయి. జుట్టు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: