ఈ టిప్ పాటించి స్నానం చేస్తే జుట్టు సమస్యలు మాయం?

Purushottham Vinay
ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం ఇంకా అలాగే వాతావరణ కాలుష్యం ఇలా చాలా కారణాల వలన జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువగా తలెత్తుతు ఉంటాయి. ఇటువంటి జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఒక సూపర్ టిప్ ని ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల చాలా ఈజీగా మీరు జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.ఈ టిప్ ని వాడడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును చక్కగా పెంచే ఆ టిప్ ఏమిటి.. ఆ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి..ఇంకా ఎలా వాడాలి..వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ తిప ని తయారు చేసుకోవడానికి మనం మెంతులను ఇంకా కాళోంజి విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది.మెంతుల్లో , కాళోంజి విత్తనాలల్లో చాలా పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మన జుట్టుకు బలాన్ని చేకూర్చి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో చాలా బాగా సహాయపడతాయి.


ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోని ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల మెంతులను ఇంకా అలాగే 2 టీ స్పూన్ల కాళోంజి విత్తనాలను వేసి ఈ నీటిని ఒక 15 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీళ్లు చల్లగా అయిన తరువాత ఈ నీటిని స్ప్రే బాటిల్ లో వేసుకుని జుట్టు కుదుళ్లపై స్ప్రే చేసుకోవాలి. లేదంటే ఆ నీటిలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి.ఆ తరువాత ఈ నీరు జుట్టు కుదుళ్లల్లోకి బాగా ఇంకేలా సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి. దీనిని 45 నిమిషాల నుండి గంట దాకా అలాగే ఉంచుకోవాలి. ఇక ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో లేదా హెర్బల్ షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ టిప్ ని పాటించడం వల్ల మనం జుట్టును బాగా ఒత్తుగా పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: