మృతకణాలు పోయి ముఖం అందంగా మారాలంటే..?

Purushottham Vinay
ఇక మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి న్యాచురల్ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా ఇంకా కాంతివంతంగా మార్చుకోవచ్చు.ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాను వాడడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, నలుపు, ట్యాన్ ఇంకా అలాగే మృతకణాలన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా అలాగే ముఖం చాలా అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. మన ముఖాన్ని అందంగా మార్చే ఆ టిప్ ఏమిటి ఇంకా దీనిని ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం ఒక బంగాళాదుంపను, రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జును, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని లేదా శనగపిండిని ఇంకా అలాగే చిటికెడు పసుపును వాడాల్సి ఉంటుంది. ముందుగా బంగాళాదుంపపై ఉండే చెక్కును తీసేసి దానిని ముక్కలుగా చేసుకుని ఒక జార్ లో వేసుకోవాలి.


తరువాత ఇందులో తాజా కలబంద గుజ్జును కూడా వేసి పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో బియ్యం పిండి, పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి.తరువాత ఈ మిశ్రమం కొద్దిగా ఆరిన తరువాత చేతి వేళ్లతో స్క్రబ్ చేసుకుని పూర్తిగా ఆరే దాకా అలాగే ఉంచాలి.ఆ తరువాత నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు, మృతకణాలు ఇంకా అలాగే మురికి అంతా కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే చర్మం లోతుగా బాగా శుభ్రపడుతుంది. చర్మంపై ఉండే నల్లటి మచ్చలు ఇంకా అలాగే నలుపుదనం తొలగిపోయి ముఖం చాలా అందంగా మారుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని వారానికి రెండు సార్లు వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని చాలా అందంగా, మృదువుగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: