ముఖ సమస్యలన్నీ తగ్గించి అందంగా మార్చే చిట్కా?

Purushottham Vinay
ముఖ సమస్యలన్నీ తగ్గించి అందంగా మార్చే చిట్కా?

మన ఇంట్లోనే కేవలం వంటింట్లో ఉండే రెండు కూరగాయలను ఉపయోగించి మనం మన ముఖాన్ని చాలా ఈజీగా అందంగా మార్చుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు, దుమ్ము ఇంకా ధూళి ఇంకా అలాగే  మృతకణాలన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.ముఖంపై ఉండే జిడ్డు కూడా తొలగిపోతుంది. అలాగే చర్మంపై ఉండే రంధ్రాలు ఈజీగా మూసుకుపోతాయి. ముఖంపై ఉండే నలుపు తొలగిపోయి ముఖం చాలా అందంగా మారుతుంది. ఈ టిప్ ని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం ఒక టమాటను, ఒక కీరదోసకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కీరదోసను ఇంకా టమాటను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 


ఇక జిడ్డు చర్మం ఉన్న వారు అయితే ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. తరువాత ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేసుకుని డీఫ్రిజ్ లో ఉంచాలి. ఇక ఈ మిశ్రమం ఐస్ క్యూబ్స్ లాగా మారిన తరువాత వాటిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ క్యూబ్స్ ను తీసుకుని సర్క్యులర్ మోషన్ లో రుద్దుతూ ముఖానికి అప్లై చేసుకోవాలి. అయితే దీనిని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి బాగా తుడుచుకోవాలి.ఆ తరువాత ఈ టిప్ ని ఉపయోగించాలి. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ ను రుద్దుకోవడం వల్ల చర్మానికి రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. చర్మంపై ఉండే జిడ్డు, నలుపు ఇంకా మృతకణాలు తొలగిపోతాయి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా ఇంకా అలాగే కాంతివంతంగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: