జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టే సూపర్ టిప్?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. జుట్టు ఒత్తుగా, అందంగా ఇంకా అలాగే కాంతివంతంగా కూడా తయారవుతుంది. ఇంకా అలాగే జుట్టు పలుచగా ఉన్న వారు ఈ చిట్కాను ఖచ్చితంగా వాడడం వల్ల వారి జుట్టు ఒత్తుగా మారుతుంది.ఇక జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును ఒత్తుగా మార్చే ఈ నూనెను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా అలాగే దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అలాగే ఈ నూనెను ఎలా వాడాలి..వంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ నూనెను తయారు చేసుకోవడానికి ముందుగా మనం తాజా కలబంద ఆకును, మెంతులను ఇంకా అలాగే కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.ఫస్ట్ ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. తరువాత కలబంద అంచులను తీసేసి వాటిని కూడా ముక్కలుగా చేసి ఈ నూనెలో వేసుకోవాలి.తరువాత ఈ నూనెను మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. ఇక కలబంద ఆకుల్లో ఉండే నీరంతా కూడా పోయి ఆకులు నల్లగా అయ్యే దాకా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను చల్లగా అయ్యే దాకా అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.


ఇప్పుడు ఈ నూనె నుండి మనకు కావల్సినంత నూనెను మరో గిన్నెలోకి తీసుకోని ఇప్పుడు ఈ నూనెలో 2 టీ స్పూన్ల ఉల్లిపాయ రసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా పట్టించాలి.ఇక ఈ నూనెను ఒక రోజంతా జుట్టుకు అలాగే ఉంచి మరుసటి రోజూ మీరు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం చాలా ఈజీగా తగ్గుతుంది. ఇందులో కలబంద, ఉల్లిపాయ, మెంతులు, కొబ్బరి నూనెలో మన జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఈజీగా తగ్గించి జుట్టును ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఈ నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.పలుచగా మారిన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు చిట్లడం ఇంకా జుట్టు తెగిపోవడం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ విధంగా మన ఇంట్లోనే నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టును ఒత్తుగా, పొడువుగా ఇంకా అలాగే మృదువుగా కూడా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: