హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ ని తగ్గించే సూపర్ టిప్?

Purushottham Vinay
ప్రస్తుతం చాలా మందికి కూడా జుట్టు సమస్యలు ఎక్కువై పోతున్నాయి. చాలా చిన్న వయస్సులోనే జుట్టు సమస్యలు వస్తున్నాయి. అసలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత రావాల్సిన బట్టతల  చిన్న వయసులోనే చాలా మందికి వస్తుంది.చిన్న వయసులోనే ఈ సమస్యలు రావడం వల్ల నలుగురిలో తిరగడానికి చాలా మొహమాటపడుతున్నారు. ఈ క్రమంలో జుట్టు సంరక్షణకు మార్కెట్లో దొరికే మందులు వాడుతూ ఇంకా జుట్టు సమస్యలను ఎక్కువ చేసుకుంటున్నారు. కొన్ని రకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్ వాడుతూ ఆ సమస్యని బాగా ఎక్కువ అయ్యేలా చేస్తున్నారు.  జుట్టు తెల్లబారకుండా ఇంకా ఊడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంట్లోనే కొన్ని ఆరోగ్యకరమైన సహజసిద్ధమైన చిట్కాలను తయారు చేసుకొని జుట్టుకు సంబంధించిన సమస్యలని ఈజీగా పోగొట్టుకోవచ్చు.అందుకు ముందుగా టీ డికాషన్ ని తయారు చేసుకోవాలి. ఆ డికాషన్లో మళ్లీ టీ పొడి వేసి ఒక గ్లాసు నీరు పోసి ఒక టీ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.


ఇది రెడీ అయ్యాక దీనిని జుట్టుకి అప్లై చేసుకుని అర్ధ గంట తర్వాత   కెమికల్స్ తక్కువ గల షాంపుతో తలస్నానం చేస్తే తెల్ల జుట్టు ఇంకా జుట్టు రాలే సమస్య నుంచి ఈజీగా బయటపడతారు. మన ఆరోగ్యానికి ఇంకా అందానికి సంబంధించి మన వంటింట్లోనే చాలా రకాల మందులు ఉంటాయి. వాటిని వాడడం వలన మనకు ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది.ఇక ఇప్పుడు తయారు చేసుకున్న డికాషన్ ని వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవడం వలన జుట్టు ఖచ్చితంగా నల్లగా తయారవుతుంది. జుట్టు సమస్యలకి ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అయితే చాలామంది కూడా ఇంగ్లీష్ మందులతో చాలా రకాల జుట్టు సమస్యలని ఎదురుకుంటున్నారు. అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన చిట్కా పాటించండి. ఖచ్చితంగా మీ జుట్టు నల్లగా మారడమే కాకుండా తెల్ల జుట్టు రావడాన్ని కూడా తగ్గించి జుట్టు ఊడిపోకుండా కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: