జుట్టు సమస్యలను తరిమికొట్టే సింపుల్ టిప్?

Purushottham Vinay
జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కలబందతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది.జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, చుండ్రు సమస్యను నివారించడంలో, జుట్టును మృదువుగా చేయడంలో కలబంద మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే కలబందను ఏ విధంగా వాడటం వల్ల మనం చక్కటి అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కలబందతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ముందుగా మనం ముదురుగా ఉండే పెద్ద ముక్క కలబందను తీసుకోవాలి. దానిని కట్ చేయగానే దాని నుండి పచ్చ సొన వస్తుంది. ఈ సొన అంతా పోయే దాకా కలబందను బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత దానిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి.


ఇప్పుడు ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకోని ఇందులో కలబంద ముక్కలను వేసి వేడి చేయాలి. ఇంకా ఈ నూనెను కలుపుతూ చిన్న మంటపై 5 నుండి 6 నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ ని ఆఫ్ చేయాలి. కలబందలోని గుణాలు నూనెలోకి దిగి నూనె రంగు మారడాన్ని మీరు గమనించవచ్చు. ఈ నూనెను పూర్తిగా చల్లారే దాకా అలాగే ఉంచాలి.తరువాత దానిని వడకట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కలబంద నూనె తయారవుతుంది. దీనిని ప్రతి రోజూ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఈ నూనెను ప్రతి రోజూ ఉపయోగించే సమయం లేని వారు వారానికి రెండు సార్లు నూనెను గోరు వెచ్చగా చేసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఈ విధంగా కలబందతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు మెత్తగా, మృదువుగా ఇంకా ఆరోగ్యంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: