జుట్టు ఊడిపోతుందా? అయితే ఇది ట్రై చేయండి?

Purushottham Vinay
జుట్టు కూడా మన అందం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందమైన జుట్టు మన ముఖానికి ఎంతో అందం తెస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం లేదు. జుట్టు చూడటానికి అందంగా ఇంకా చక్కగా ఉంటేనే మనం చూడటానికి చాలా అందంగా కనిపిస్తాము.ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.చాలా ఇబ్బందులు పడుతున్నారు.జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు నిర్జీవంగా మారడం, చుండ్రు ఇంకా అలాగే తల చర్మం నుండి పొట్టు రాలడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. జుట్టును అందంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఎటువంటి ప్రయత్నం ఫలించక ఇబ్బంది పడే వారు మనలో చాలా మంది ఉన్నారు. ఈ చిన్న టిప్ ని ఉపయోగించి మనం జుట్టు సంబంధిత సమస్యలన్నింటి నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు.ముందుగా ఒక గిన్నెలో మన జుట్టుకు తగినంత షాంపును తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. అలాగే తరువాత పంచదార వేసి కూడా కలపాలి.ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. ఆ తరువాత 5 నిమిషాల పాటు అలాగే సున్నితంగా మర్దనా చేయాలి. దీనిని ఒక పది నిమిషాల పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేచాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు అనేవి చాలా బలంగా తయారవుతాయి.ఇంకా అలాగే కుదుళ్లల్లో పేరుకుపోయిన మురికి, జిడ్డు తొలగిపోతుంది. అలాగే చుండ్రు, పొట్టు రాలడం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా జుట్టు రాలడం తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. జుట్టు అందంగా, కాంతివంతంగా ఇంకా మృదువుగా తయారవుతుంది. ఈ విధంగా ఈ టిప్ వారానికి రెండు సార్లు వాడడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: