ఈ షాంపుతో నల్లని ఒత్తయిన జుట్టు మీ సొంతం?

Purushottham Vinay
ఈ షాంపుతో నల్లని ఒత్తయిన జుట్టు మీ సొంతం?

ఈ రోజుల్లో చాలా మంది కూడా వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్‌లో లభించే ఎన్నో రకాల హెయిర్ వాష్‌లను వినియోగిస్తున్నారు.అయితే ఈ షాంపూలలో కెమికల్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు త్వరగా పాడవుతుంది. ఇంకా అంతేకాకుండా కొందరిలో రాలిపోతోంది. అయితే ఇలాంటి జుట్టు సమస్యల నుంచి చాలా సులభంగా ఉపశమనం పొందడానికి హెర్బల్ షాంపూని వాడటం చాలా ముఖ్యమని సౌందర్యం నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు గ్రీన్ టీ హెర్బల్ షాంపూని వినియోగించాల్సి ఉంటుంది. ఈ టీ షాంపూని వాడటం వల్ల చాలా ఈజీగా అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. ఇక ఇప్పుడు ఈ హెర్బల్‌ షాంపూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ముందుగా మీరు గ్రీన్ టీ ఆకులను పొడి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ టీ పొడిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని కలపండి.అలాగే ఇందులో పెప్పర్‌మింట్ ఆయిల్‌ను కూడా  వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మరసం, కొబ్బరి నూనె ఇంకా అలాగే తేనె కలిపి ఫైన్‌గా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.గ్రీన్ టీ షాంపూలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు ఇంకా అలాగే జింక్ వంటి పోషకాలు ఈజీగా లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేస్తే పెరుగుదలకు ఇంకా అలాగే జుట్టు రాలడాన్ని కూడా చాలా సులభంగా తగ్గిస్తాయి. ఇంకా అంతేకాకుండా జుట్టులోని చుండ్రు సమస్యలను తగ్గించడానికి కూడా ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.కాబట్టి క్రమం తప్పకుండా ఈ షాంపూతో జుట్టుకు మసాజ్‌ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది చాలా మెరుగుపడుతుంది.ఇంకా అంతేకాకుండా జుట్టు ఒత్తుగా ఇంకా బలంగా కూడా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: