జుట్టు రాలే సమస్యకు మెరుగైన టిప్?

Purushottham Vinay
ఈ రోజుల్లో అసలు వయసుతో సంబంధం లేకుండా అందరిని జుట్టు రాలే సమస్య ఎంతగానో వేధిస్తుంది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, రసాయనాలు కలిగిన షాంపులను ఇంకా అలాగే హెయిర్ కండీష్ నర్ లను వాడడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి చాలా మంది చాలా ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు.అంతేగాక రకరకాల నూనెలను కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు.అయినా కానీ అసలు ఎటువంటి ఫలితం ఉండదు.చాలా తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఈ చక్కటి టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సలుభంగా జుట్టు రాలే సమస్యని తగ్గించుకోవచ్చు. ఇక జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మనకు ఆవ తెలగ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆవాల నుండి నూనె తీయగా మిగిలిన పిండిని ఉపయోగించడం వల్ల మనం ఖచ్చితంగా కూడా ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఒక టీ స్పూన్ మెంతులు ఇంకా అలాగే ఒక గ్లాస్ నీళ్లు పోసి ఈ నీటిని వేడి చేయాలి.


ఆ నీళ్లు బాగా మరిగిన తరువాత అందులో రెండు రెమ్మల కరివేపాకును అందులో వేసి మరిగించాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే దాకా బాగా మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఒక గిన్నెలో మన జుట్టుకు తగినంత ఆవ తెలగ పిండిని తీసుకోని  ఇందులో ముందుగా తయారు చేసుకున్న నీటిని పోస్తూ పేస్ట్ లా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. తరువాత ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇక ఈ చిట్కాను వాడడం వల్ల మన జుట్టు పెరుగుదలలో వచ్చిన మార్పును మనం చాలా ఈజీగా గమనించవచ్చు.  జుట్టు ఎక్కువగా రాలుతున్న వారు ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ  టిప్ వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు మీ జుట్టు పట్టులా మృదువుగా కూడా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: