జుట్టు కుదుళ్లని దృఢముగా చేసే రెమెడీ?

Purushottham Vinay
చెడు ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, ఒత్తిడి ఇంకా అలాగే పలు రకాల మందుల వాడకం వంటి కారణాల వల్ల జుట్టు కుదుళ్లు చాలా బలహీనంగా మారుతుంటాయి.అయితే జుట్టు కుదుళ్లు అనేవి బలహీనంగా మారే కొద్ది హెయిర్ ఫాల్ సమస్య చాలా తీవ్రతరంగా మారుతుంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ జుట్టు కుదుళ్ళు బలంగా మారడమే కాదు హెయిర్ ఫాల్ సమస్యను కూడా చాలా సులభంగా మీరు అరికట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ రెమెడీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు మిక్సీ జార్ ని తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో కొబ్బరి పాలని వేరు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ ని తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి పాలని పోసుకోవాలి.


అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా ఒకటికి రెండు సార్లు బాగా అప్లై చేసుకోవాలి. ఒక గంటన్నర లేదా రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా మీరు తల స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ  రెమెడీని ట్రై చేస్తే జుట్టు కదుళ్లు చాలా స్ట్రాంగ్ గా మారతాయి. దాంతో హెయిర్ ఫాల్ సమస్య చాలా ఈజీగా ఇంకా క్రమంగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే ఈ  రెమెడీని ట్రై చెయ్యడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా ఇంకా ఆరోగ్యంగా కూడా మారుతుంది. జుట్టు సిల్కీగా, షైనీ గా కూడా మెరుస్తుంది. సిల్కీ హెయిర్ కావాలనుకునేవారికి ఈ రెమెడీ చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రెమెడిని తప్పకుండా ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: