అందంగా కనబడాలంటే ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు?

Purushottham Vinay
అందంగా కనబడాలని మనం చాలా రకాల కాస్మొటిక్స్ వాడుతూ ఉంటాము. అయితే మన చర్మానికి అవి అంతగా సరిపడవు. ముఖ్యంగా మేకప్ ఉత్పత్తులు చర్మానికి చికాకు  పెట్టించి  మొటిమలు పెరగడానికి దారితీస్తాయి. వివిధ రంగుల ఐషాడోలు ఇంకా కాజల్‌లను ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల రోజువారీ మేకప్ వేసుకోవడం కూడా అంత మంచిది కాదని డెర్మటాలజీ నిపుణులు సూచిస్తున్నారు.చాలా మంది ముఖ చర్మం చాలా జిడ్డుగా ఉందని పదే పదే నీళ్లతో కడుగుతుంటారు. నిజానికి చర్మం నుంచి విడుదలయ్యే స్రావాలు మన ముఖానికి మంచి మేలే చేస్తాయి. తరచూగా ముఖాన్ని కడగడం వల్ల ఆ స్రావాలు ఈజీగా తొలగిపోతాయి.దాని ఫలితంగా వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు ఈజీగా వస్తాయి. అందువల్లనే పదేపదే ముఖాన్ని కడగడం మానుకోవాలని చర్మ సంబంధిత నిపుణులు తెలుపుతున్నారు. రోజుకు రెండు మూడుసార్ల కంటే ఎక్కువగా ముఖం కడగకూడదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.


అలాగే నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ ఇంకా రిఫ్రెష్‌గా ఉంచుతుందని మనందరికీ తెలుసు. అందువల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉండి బాగా మెరుస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యకు దారి తీయవచ్చు. అందువల్ల చర్మం పొడిబారుతుంది.ఇంకా అలాగే మనకు తెలియకుండానే మన ముఖాన్ని తరచుగా తాకుతుంటాం. ఇలా చేయడం వల్ల మన చేతుల్లో ఉండే సూక్ష్మక్రిములు చర్మంపై దద్దుర్లు ఇంకా దురదను ఎక్కువగా కలిగిస్తాయి. అందుకే చర్మాన్ని తాకే ముందుకు చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం లేని చేతులతో ముఖాన్ని తాకవద్దని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే శరీరానికి సరిపడినంతగా నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ క్రమంలోనే చర్మాన్ని ఆరోగ్యంగా ఇంకా ముడతలు పడకుండా ఉంచే కొల్లాజెన్ వంటి ప్రొటీన్ల ఉత్పత్తి మందగిస్తుంది. మంచి చర్మం కోసం ప్రతి రోజూ కూడా కంటినిండ నిద్ర ఉండేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: