చంకలో నలుపు, దుర్వాసన తగ్గే టిప్స్?
చాలా మందికి కూడా చంకలో నలుపు ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అయితే చంకలో దుర్వాసన కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది.చంకలో నలుపు తగ్గి దుర్వాసన పోవాలంటే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీ అందుబాటులో లేని వారు దాని స్థానంలో తేనెను కూడా వాడవచ్చు. తరువాత ఈ జెల్లీలో ఒక టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో 5 చుక్కల నిమ్మరసాన్ని, వంటసోడాను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వాడే ముందు చంక భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చంక భాగంలో రాసి ఒక 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 30 నిమిషాల తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఈ టిప్ పాటించడం వల్ల చంక భాగంలో నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.
ఈ మిశ్రమాన్ని కేవలం చంక భాగంలోనే కాకుండా మోచేతులు, మోకాళ్లు వంటి ఇతర భాగాలపై కూడా వాడవచ్చు.పెట్రోలియం జెల్లీని వాడడం వల్ల చర్మానికి తగినంత తేమ లభించడంతో పాటు చర్మ కణాలు పాడవకుండా ఉంటాయి. పసుపును వాడడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడడంతో పాటు చర్మం పై ఉండే మృత కణాలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. అలాగే నిమ్మరసం మన చర్మానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. నిమ్మరసాన్ని వాడడం వల్ల చర్మంపై ఉండే నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది. మన చర్మాన్ని శుభ్రపరచడంలో వంటసోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ప్రదేశంలో ఉండే బ్యాక్టీరియాను నశింపజేసి దుర్వాసన రాకుండా చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.