చాలా మందికి ముఖం నల్లగా మారి పింపుల్స్, బ్లాక్ హెడ్స్ లాంటి అనేక రకాల చర్మ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి.సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల లేదా ట్రాఫిక్ కాలుష్యం వల్ల హైపర్పిగ్మెంటేషన్, సన్ టాన్ ఏర్పడుతుంది. పైగా ఈ వర్షాకాలంలో కూడా వేడి ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల చర్మం ముదురు రంగులో మారే అవకాశముంది. చాలా ఎక్కువ సూర్యరశ్మి వలన హైపర్పిగ్మెంటేషన్, సన్‌బర్న్, డార్క్ స్పాట్స్ ఏర్పడవచ్చని సూచిస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ఔషధాలు వాడటం కంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.అలోవెరా జెల్ తీసుకుని చర్మానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జులో పసుపు కలిపి రాసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.కొబ్బరి పాలలో దూదిని నానబెట్టాలి. దానిని 15 నిమిషాలు అలాగే ఉంచి.. అనంతరం దానితో శరీరాన్ని లేదా టాన్ ఉన్న ప్రదేశాన్ని ప్యాక్ చేసి.. తర్వాత దానిని చల్లని నీటితో కడగాలి. కొబ్బరి పాలు టాన్ రిమూవ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అంతే కాకుండా చర్మానికి మంచి రక్షణ, పోషణ అందిస్తాయి. అందుకే చాలా బ్యూటీ ప్రొడెక్ట్స్‌లో కొబ్బరిపాలు ఉపయోగిస్తారు.పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. దానిని ఒక మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి. దానిని మీ చర్మంపై అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి.. ఆపై దానిని కడగాలి. ఈ టిప్ ను చాలామంది ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయి.ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి.. 20 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే టాన్ తొలగిపోతుంది.