ఇలా చేస్తే కళ్లకింద నలుపు చిటికెలో మాయం!

Purushottham Vinay
కళ్లజోడు ధరించే వారిలో చాలా మందిలో కూడా కంటి కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు ఇంకా జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి.అయితే ఇక వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు చాలా అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా  చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలోకనుక పూస్తే.. మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా ఇంకా బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి..ఒక 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు లేదా మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి. ఇలా చేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.అలాగే తేనెలో కొద్దిగా పాలు ఇంకా ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంలో రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం కూడా చాలా తాజాగా మారుతుంది.అలాగే బంగాళదుంపలను (potato) సన్నగా తరిగి జ్యూస్ చేసుకోవాలి.ఇక దూదిని తీసుకోని ఓ బంతిలా చేసి ఆ జ్యూస్‌లో ముంచాలి.


తరువాత కళ్లు మూసుకొని కాటన్ బాల్స్‌ను కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.అలాగే రాత్రిళ్లు బాదం నూనెను మీ ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఆల్మాండ్ ఆయిల్‌ను నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయడం చాలా మంచిది. ఇక ఇలా రాత్రి పూట రాసి ఉదయాన్నే నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయి.అలాగే ఒక టీ స్పూన్ టమాటా జూస్ ని నిమ్మరసంతో కలిసి కళ్ల కింద అప్లై చేయండి. ఒక పది నిమిషాలు ఉంచుకుని తీసేయండి. ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే బంగాళదుంపను గుజ్జుగా చేసుకుని దూది అందులో ముంచి డార్క్ సర్కిల్స్ కవర్ అయ్యేలా ఉంచుకోండి. ఒక పది నిమిషాలు అలా ఉంచి చన్నీళ్లతో కడగండి. ఇలా రెగ్యులర్ గా చెయ్యడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: