బంతిపువ్వుతో అద్భుతమైన సౌందర్యం మీ సొంతం!

Purushottham Vinay
అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి చాలా ప్రొడక్ట్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి అశించిన ఫలితాలను ఇవ్వకపోవాడంతో అందరు కూడా ఇక ఇంటి నివారణలపై ఎక్కువ అసక్తి చూపుతున్నారు.అయితే మెరిసే చర్మాన్ని పొందడానికి టెర్రస్ ఇంకా బాల్కనీలలో పెరిగే బంతిపూలు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని చాలా మందికి తెలియదు. బంతి పూలను ఉపయోగించి అందమైన చర్మాన్ని ఎలా పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.బంతి పువ్వును కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇలాంటి గుణాలున్న బంతి ప్రత్యేకతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని బిగుతుగా ఉంచడంతో పాటు గ్లో మెయింటైన్ చేయడంలో బంతి  చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేసవి కాలంలో వచ్చే దద్దుర్లు ఇంకా వడదెబ్బ సమస్యలను బంతి పువ్వులతో అధిగమించవచ్చు. ముఖంపై మొటిమలు ఇంకా మచ్చల సమస్య ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.


వేసవి కాలంలో మొటిమల సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో 3 నుంచి 4 బంతి పువ్వులను తీసుకుని..వాటిని బాగా శుభ్రం చేసి దానిని పేస్ట్ చేయండి. అలాగే ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగును కలిపి ముఖానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కడిగే ముందు చల్లటి నీళ్లను ముఖంపై చిలకరించి వేళ్లతో బుగ్గలపై బాగా మసాజ్ చేయండి. మీ ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉంటే..ఇలా వారానికి రెండుసార్లు ఈ రెసిపీని ఉపయోగించండి.టోనర్ ఇంకా అలాగే ఫేస్ ప్యాక్ కాకుండా బియ్యం పిండిలో బంతి పువ్వుల పేస్ట్‌ను కలిపి స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. వేసవి కాలంలో పొడి చర్మం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ స్క్రబ్‌తో మంచి ఉపశమనం పొందవచ్చు.ఇక బంతిపువ్వు కేవలం చర్మానికే కాదు జుట్టుకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ పువ్వులో ఉండే పోషక గుణాలు జుట్టు రాలడం ఇంకా అలాగే మెరుపు కోల్పోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: