ఈ జ్యూసులతో బరువు తగ్గి స్లింగా అందంగా అవుతారు!

Purushottham Vinay
ఇక మారిన ఆహారపు అలవాట్లతో బరువు పెరిగిపోవడం అనేది నేడు తీవ్ర విపత్కర సమస్యగా మారింది. అయితే పెరిగిన బరువును తగ్గించుకోవడం అనేది ఇప్పుడు అంత తేలికైన పని కాదు.దీని కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు నిపుణుల సలహాలు అలాగే సూచనలు పాటించడం అవసరం. బరువు తగ్గేందుకు ఘనాహారంతో పాటు ద్రవాహారం కూడా బాగా ఉపయోగపడుతుంది. పానీయాలను డైట్ లో చేర్చుకోవడం ద్వారా వేగంగా బరువు తగ్గే ఛాన్స్ ఉంది. అవి శరీరంలోని అదనపు కొవ్వును ఈజీగా తొలగిస్తాయి. దీంతో అనేక రకాల రోగాలు దూరమవుతాయి. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడే డ్రింక్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1.ఆపిల్ సైడర్ వెనిగర్: అధిక బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇది పొట్టలోని పీహెచ్ స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.ముందుగా వెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని వేసి కలపండి. ఇంకా దీనికి నిమ్మరసం కలపాలి.


2.వాము నీరు: అలాగే వాము నీరు కూడా పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మీరు క్రమం తప్పకుండా వాము నీటిని తాగవచ్చు. ఒక గ్లాసు నీటిలో వాము వేసి ఉడకించడం ద్వారా ఈ పానీయాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క శరీర జీవక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది.


3.గ్రీన్ టీ: ఇంకా ఈ గ్రీన్ టీ జీర్ణవ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట చాలా శుభ్రంగా ఉంటుంది. ఇది జీవక్రియను బాగా వేగవంతం చేస్తుంది.


4.పైనాపిల్ జ్యూస్: పైనాపిల్ జ్యూస్ కూడా బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీవక్రియను చాలా వేగవంతం చేస్తుంది. జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను బాగా ఆరోగ్యంగా ఉంచుతుంది.


5.జీలకర్ర నీరు: జీలకర్రను ఓ గ్లాస్ నీటిలో రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్ని ఆ నీటిని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: