ఉల్లిపాయ నూనె జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
ఉల్లిపాయ నూనెలో పోషకాలు ఎంతో పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఈజీగా నివారిస్తుంది. ఇది జుట్టు రంగు మారడాన్ని కూడా తగ్గిస్తుంది.ఇంకా పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది.పొడిబారిన జుట్టుకు ఉల్లిపాయ నూనె ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా మార్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మెరుపు అనేది బాగా పెరుగుతుంది. కానీ మీ స్కాల్ప్ జిడ్డుగా కనుక ఉంటే, దాని వాడకాన్ని తగ్గించేసేయండి.అలాగే మీ జుట్టును మెరిసేలా చేస్తుంది..ఇక ఉల్లిపాయ నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వలన జుట్టుని మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టుకు మంచి మెరుపును ఇస్తుంది. ఉల్లిపాయ నూనె జుట్టు మీద కండిషనింగ్ ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. షాంపూ చేయడానికి ముందు దీనిని మీ హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.చుండ్రు వదిలించుకోవడానికి చాలా మంచిది.


అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉల్లిపాయ నూనెను ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది మీ స్కాల్ప్ ను బాగా శుభ్రపరుస్తుంది. జుట్టును ఒత్తుగా మార్చడంలో కూడా బాగా సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు వేగంగా పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది.ఇక మీ ఇంట్లోనే ఈ ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలంటే..ఉల్లిపాయ నూనె చేయడానికి ముందుగా ఉల్లిపాయను మిక్సీలో వేసి అవసరాన్ని బట్టి దాన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఆ తరువాత, పాన్ తీసుకొని అందులో కొబ్బరి నూనె పోయాలి.తరువాత దానికి ఉల్లిపాయ పేస్ట్ ని జోడించండి.కాసేపు అది ఉడకనివ్వండి. ఇక మరిగిన తర్వాత, గ్యాస్ ని ఆఫ్ చేయండి. తరువాత ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. ప్రత్యేక డబ్బాలో దీనిని దాచి..ఇక రోజూ వినియోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: