జుట్టు ఆరోగ్యంగా అందంగా వుండాలంటే ఇలా చెయ్యండి!

Purushottham Vinay
పెరుగులో చాలా విటమిన్లు ఇంకా అలాగే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చుండ్రు ఇంకా దురదలను తొలగిస్తాయి. పెరుగు సహజ కండీషనర్‌గా బాగా పనిచేస్తుంది. అందుకే వారానికి రెండుసార్లు పెరుగును తప్పనిసరిగా ఉపయోగించాలి. పెరుగుతో ఈజీగా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. మీకు సమయం తక్కువగా కనుక ఉంటే సాధారణ పెరుగును మీ జుట్టుకు పట్టించవచ్చు. కొంతసేపు బాగా మర్దన చేయాలి. అలా చేసిన తర్వాత ఒక 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత మీ తలని గోరువెచ్చని నీటితో కడగాలి. అప్పుడు మంచి ఉపశమనం దొరుకుతుంది. ఆలివ్ నూనె ఇంకా తేనె కూడా జుట్టుకు చాలా మేలు చేస్తాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా అలాగే మాయిశ్చరైజింగ్ లక్షణాలు అనేవి ఉంటాయి. ఇవి మీ జుట్టుని ఎల్లప్పుడూ పొడిబారకుండా చేస్తాయి. ఇందుకోసం మీరు అరకప్పు పెరుగు తీసుకుని అందులో 3 చెంచాల తేనె ఇంకా అలాగే 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయాలి. బాగా ఆరేవరకు అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో బాగా కడగాలి.


పెరుగు, నిమ్మ ఇంకా అలాగే తేనెతో చేసిన హెయిర్ ప్యాక్ మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మృతకణాలు అనేవి తొలగిపోయి పోషకాలు జుట్టు మూలాల్లోకి చేరుతాయి. పొడి, నిర్జీవమైన జుట్టు చాలా ఆరోగ్యంగా మారుతుంది. దీని కోసం 2 టీస్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మ ఇంకా 1 టీస్పూన్ తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించి ఒక 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మీకు మంచి ఉపశమనం ఉంటుంది.అలాగే కొబ్బరి నూనెతో పెరుగు కలిపి అప్లై చేయవచ్చు. ఇది మీ జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది. లోపలి నుంచి జుట్టుని బాగా తేమ చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్‌ చేయడానికి 2 టీస్పూన్ పెరుగు, 1 టీస్పూన్ తేనె ఇంకా అలాగే కొబ్బరి నూనె బాగా కలపాలి. దీనిని జుట్టుకి బాగా పట్టించి బాగా మసాజ్ చేసి కాసేపు ఆరనివ్వాలి.ఆ తర్వాత తేలికపాటి వేడి నీటితో దీనిని కడగాలి.ఇది జుట్టుకి మంచి షైనింగ్‌ వస్తుంది. వారంలో రెండుసార్లు ఇలా గనుక చేస్తే జుట్టు బాగా మృదువుగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: