ద్రాక్షతో మంచి జుట్టు, గ్లామర్ మీ సొంతం..

Purushottham Vinay
నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల కలిగే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ వల్ల ద్రాక్ష నల్లని రంగులో కనిపిస్తుంది. ఇక ఈ రెస్వెరాట్రాల్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే.. ద్రాక్ష పండు అంత ముదురు రంగులో కనిపిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ చర్మ కణాలను దెబ్బతినకుండా ఎంతగానో కాపాడుతుంది. ఇక అంతేకాదు ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి నల్ల ద్రాక్ష చర్మాన్ని యవ్వనంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల ద్రాక్షలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది చర్మాన్ని బాగా మెరిసేలా చేస్తుంది. ముఖంపై మొటిమలని కూడా నివారిస్తుంది.ఇంకా ముఖం నిగనిగలాడేలా చేస్తుంది.ఒత్తైన, పొడవాటి జుట్టుని ఇస్తుంది.నల్ల ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో విటమిన్ ‘ఇ’ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి తలకు రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తాయి. అందువలన జుట్టును బలోపేతం చేయడంతో పాటు బాగా ఆరోగ్యకరంగా పెరుగేలా చేస్తాయి.

తలకు మెరుగైన రక్త ప్రసరణ జరగడం వలన చుండ్రు ఇంకా జుట్టు రాలడం అలాగే జుట్టు రంగు మారడం వంటి వాటిని నియంత్రిస్తుంది.నల్ల ద్రాక్ష అందానికే కాదు ఆరోగ్యానికి కూడా మేలుని చేస్తుంది. ఇది షుగర్ పేషేంట్స్ కి చాలా మంచిది. ఈ నల్ల ద్రాక్షను మితంగా వైద్యుల సలహాతో కనుక మీరు తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచి ప్రయోజనకారి.ఇది రెస్వెరాట్రాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా ఈజీగా తగ్గిస్తుంది.గర్భిణీలకు కూడా ఈ నల్ల ద్రాక్ష చాలా మంచిది. ఇక గర్భధారణ సమయంలో నల్ల ద్రాక్ష తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.ఒకొక్కసారి అలెర్జీలు లేదా కడుపులో పూతకి కూడా తగ్గుతుంది.అందుకే గర్భధారణ సమయంలో నల్ల ద్రాక్ష తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడడం, మలబద్ధకం నుండి ఉపశమనం ఇంకా బలమైన రోగనిరోధక వ్యవస్థ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి గర్భిణీలు నల్ల ద్రాక్షను డాక్టర్ల సలహాను అనురించి  ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: