ఇక
ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా జుట్ట నెరిసిపోవడం ప్రస్తుతం మనం చాలామందిలో గమనిస్తున్నాం. అయితే, పిల్లల్లో కూడా జుట్టు ఎందుకు నెరిసిపోతుందని శాస్త్రవేత్తలు అనేక రకాలుగా పరిశోధనలు చేస్తున్నారు. వెంట్రుకలు తెల్లగా మారడంపై అనేక విషయాలను గ్రహించారు. మరి ఆ విశేషాలంటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం..సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. జుట్టు నల్లబడటానికి అసలు కారణం మెలనిన్. ఇది జట్టుకు రంగునిచ్చే ఓ వర్ణద్రవ్యం.మన శరీరంలో ఇది లోపించినప్పుడు.. మన జుట్టు రంగు తెల్లగా మారుతుందట. ఇది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా చెబుతున్నారు. ఇక డీప్గా కనుక వెళ్తే.. జుట్టు మూల భాగాల్లో మెలనోసైట్స్ కణాలు అనేవి ఉన్నాయి. ఈ కణాలు మెలనిన్ను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల మన జుట్టు నల్లగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి పెద్దయ్యాక, ఈ కణాలు కూడా బలహీనపడటం జరుగుతుందట. అందువల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే మన జుట్టు అప్పుడు తెల్లబడటం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం దీని ప్రభావం కేవలం వృద్ధుల్లోనే కాదు, యువత, పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి అనేక రకాల కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. శరీరంలో పోషకాల కొరత, ధూమపానం, అనారోగ్యం ఇంకా అలాగే ఒత్తిడితో కూడిన జీవితం మొదలైనవి జుట్టు రంగుపై ప్రభావం చూపుతాయి.అందువల్ల వాటిని తగ్గించుకుంటే ఈ సమస్య ఉండదు.ఇక న్యూయార్క్లోని
కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి గల అసలు కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. జుట్టు నెరసిపోవడానికి ఒత్తిడి అసలైన ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ విషయం వారు చేసిన అధ్యయనంలో కూడా రుజువైంది. అధ్యయనం సమయంలో ప్రజల్లో ఒత్తిడి స్థాయిలు కనుక తగ్గితే.. జుట్టు తిరిగి మళ్లీ నల్లగా మారడం ప్రారంభమైంది. ఇక ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా చాలా ఆశ్చర్యపోయారట. అంటే పరిశోధన ప్రకారం.. శారీరక, మానసిక ఒత్తిడి జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చేశారు.కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోడానికి మార్గాలను అన్వేషించండి.