తస్మాత్ జాగ్రత్త: వీటిని నేరుగా ముఖానికి అప్లై చేస్తున్నారా..?

Divya
మహిళల నుంచి పురుషుల వరకు ప్రతి ఒక్కరు కూడా మెరిసే ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు. చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ భయంతో మార్కెట్లో దొరికే కెమికల్ ఉత్పత్తులను వాడడానికి భయపడుతూ..సహజ సిద్ధమైన పదార్థాల ద్వారా ముఖానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. ఇకపోతే చాలామంది వంట ఇంట్లో దొరికే సహజ పదార్థాలను ముఖానికి అప్లై చేసి వారి ముఖాన్ని మరింత అందంగా మార్చుకుంటూ ఉంటారు.. ఇక్కడ మీకు తెలియని మరొక విషయం ఏమిటంటే.. వంటగదిలో లభించే కొన్ని సహజ పదార్థాలతో నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయి.. అయితే ముఖంపై నేరుగా అప్లై చేయకూడని వంటగది పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.నిమ్మకాయ:
నిమ్మరసాన్ని ఎక్కువగా సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇకపోతే ఇంట్లో తయారు చేసుకునే రకరకాల ఫేస్ ప్యాక్ లలో నిమ్మరసం ను నేరుగా ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుందట. నిమ్మరసం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ముఖానికి నేరుగా అప్లై చేయడం వల్ల చికాకు కలిగిస్తుంది. నేరు గా ముఖానికి అప్లై చేస్తే చర్మంపై బొబ్బలు, దద్దుర్లు, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
2. బేకింగ్ సోడా:
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ బేకింగ్ సోడా ను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిని మొటిమలను తగ్గించి చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు నల్లటి మచ్చలను తొలగించడానికి ఎక్కువగా ఈ బేకింగ్ సోడా ఉపయోగిస్తున్నారు. బేకింగ్ సోడాను ముఖంపై నేరుగా అప్లై చేయడం వల్ల అలర్జీలకు , చర్మ గాయాలకు కారణం అవుతుందట.
3. చక్కెర:
చక్కెరను చర్మంపై నేరుగా అప్లై చేయడం వల్ల చర్మానికి గాయాలు ఏర్పడటంతో పాటు ఎరుపు , చికాకు , వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి.
4. వెనిగర్:
వెనిగర్ ను ఎక్కువగా టోనర్ లలో ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే  అయితే వెనిగర్ అధిక పీహెచ్, ఆమ్ల తత్వాన్ని కలిగి ఉంటుంది.. కాబట్టి చర్మం పై అప్లై చేయడం వల్ల చికాకు,  కాలిన గాయాలకు మరింత నష్టం కలగడానికి కారణమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: