బియ్యం పిండితో అందం అదరహో..!!

Divya
బియ్యంపిండి అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చే వంటకం దోశ.. చాలా మందికి ఫేవరెట్ టిఫిన్ కూడా ఇదే.. అయితే ఇంతటి చక్కటి దోశను తయారు చేసుకొనే..బియ్యం పిండి తో ముఖాన్ని కూడా అందంగా తయారు చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు. అది ఎలాగో మనం ఎప్పుడు చూసి చదివి తెలుసుకుందాం.. సాధారణంగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఒకదానిని మించి మరొకటి సౌందర్యాన్ని పెంపొందించే సాధనాలు ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రతి ఒక్కరు గత కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పదార్థం ఏమిటంటే శెనగపిండి అలాగే బియ్యం పిండి అని చెప్పవచ్చు. మన అమ్మమ్మలు.. బామ్మలు సైతం ఈ శెనగ పిండి , బియ్యం పిండి తో ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నవారే..

అయితే ఈ మధ్యకాలంలో అందంగా తయారవడానికి ఎన్నో రకాల ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి.. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.. కాబట్టి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ని పక్కన పెట్టి మనకు ఇంట్లో దొరికే పదార్థాలతో ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. పైగా ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.. మీకు కావాల్సిందల్లా కేవలం శ్రద్ధ, సమయం.. ఈ రెండింటినీ కనుక మీరు చక్కగా బ్యాలెన్స్ చేసినట్లయితే తప్పకుండా ఇంట్లో దొరికే పదార్థాలు తోనే అందంగా తయారవ్వచ్చు.

బియ్యం పిండి తో కూడా ముఖానికి ఫేస్ ప్యాక్ వేయొచ్చు.. ఇందుకోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకొని అందులో చిటికెడు పసుపు పొడి వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక దీనిని ముఖానికి అప్లై చేసి వాష్ చేస్తే ముఖం మీద ఉండే మృతకణాలు వెంటనే తొలగిపోతాయి. ఇలా చేస్తే అందంగా కూడా తయారవుతారు.
అరటి పండు మరియు తేనెతో ఫేస్ ప్యాక్..
అరటి పండును మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేయడం వలన మంచి మాయిశ్చరైజర్ గా పనిచేయడంతో పాటు ముఖం మీద వచ్చే చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ కూడా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: