ఈ పొడితో బలమైన..దృఢమైన జుట్టు మీ సొంతం..!!

Divya
ప్రస్తుత కాలంలో మనం నివసించే జీవనశైలి.. తీసుకునే ఆహారం.. లైఫ్ స్టైల్ అన్నీ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఈ కాలంలో అమ్మాయిలు , అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి విపరీతంగా జుట్టు వూడిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే జుట్టు ఎక్కువగా రాలిపోవడం మొదలైన రోజు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఒక పొడిని జుట్టుకు పట్టించడం వల్ల త్వరగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇందుకోసం మీరు ఒక స్పూన్ దాల్చినచెక్క పొడిని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు మాడుకు పట్టించాలి. ఒక గంటసేపు అలాగే వదిలేసి.. ఆ తరువాత గాఢత తక్కువగా కలిగిన తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి అది కూడా చల్లని నీటితో చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పొడవుగా.. ఒత్తుగా.. దృఢంగా మారుతుంది. ఎప్పుడైతే  జుట్టు కుదుళ్లు దృఢంగా,  ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడు జుట్టు రాలే సమస్య తగ్గి పోయి ఒత్తుగా పెరుగుతుంది.

జుట్టుకు ఈ మిశ్రమం పట్టించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. కణాలకు ఆక్సిజన్ అంది జుట్టు కుదుళ్లకు ఉత్తేజపరుస్తుంది. ఇకపోతే దాల్చిన చెక్క లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల తలలో వచ్చే చుండ్రు, దురద వెంటనే తగ్గిపోతుంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా తల మీద ఉండే చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు జుట్టు యొక్క మూలాలను దృఢంగా చేసి పోషణను అందిస్తుంది. ఈ చిట్కాలను మీరు జుట్టు రాలే సమస్య మొదలవగానే ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ తో జుట్టు సమస్యలు తెచ్చుకోకుండా కొంత సమయాన్ని , శ్రద్ధను వహిస్తే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: