ఈ ఫేస్ ప్యాక్ తో మొటిమలన్నీ మటుమాయం..!!

Divya
అమ్మాయి ఎంత అందంగా ముస్తాబు అయినప్పటికీ ముఖం మీద చిన్న మొటిమ కనిపిస్తే చాలు అస్సలు తట్టుకోలేరు. వారు చాలా నునుపైన.. ప్రకాశవంతమైన.. మెరిసే చర్మం కావాలని ఎన్నో రకాలుగా కోరుకుంటూ.. ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే అందరి చర్మతత్వం ఒకటే ఉండదు. కాబట్టి చర్మం లో రకరకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ కాలం యువతలో ఎక్కువగా కొందరిని బాధిస్తున్న ఒకే ఒక సమస్య మొటిమలు. ఇకపోతే మొటిమలు ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే.. చనిపోయిన చర్మ కణాలతో ముఖం మీద వచ్చే చిన్న చిన్న వెంట్రుకలు, నూనె తో కప్పబడినప్పుడు మొటిమలు వస్తాయి.

వైట్, బ్లాక్ హెడ్స్ కూడా మొటిమలు రావడానికి కారణం అవుతాయి. ఒత్తిడి, పొల్యూషన్ వంటి కారణాల వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ మొటిమలు ప్రతి ఒక్కరికి బాధించే సమస్యాత్మకమైన సమస్య కాబట్టి  తేలికపాటి చిట్కాలతో ఎలా తొలగించుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం సులభమైన పద్ధతులలో తెలుసుకుందాం.
ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు.. ఒక టేబుల్ స్పూన్ తేనె.. రెండింటినీ బాగా కలిపి మొటిమలు ఉన్నచోట లేదా ముఖం మొత్తం మీద ఈ ఫేస్ మాస్క్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోవడం, చర్మ సమస్యలను నయం చేయడం లో ఈ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. ఇక తేనే విషయానికి వస్తే చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడితే .. పసుపు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది అని మనకు తెలిసిన విషయమే.. మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పసుపు పోరాడి.. మొటిమలు రాకుండా దూరం చేస్తుంది. ఒక ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి .. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ చిట్కాలను పాటించడం వల్ల త్వరగా మొటిమలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: