ఈ విటమిన్లతో ఆరోగ్యకరమైన.. అందమైన చర్మం మీ సొంతం..!!
1. విటమిన్ సి:
అందం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే విటమిన్.. విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది కాబట్టి చర్మ కణాలు అందం గా మారడానికి సహాయపడతాయి. అంతేకాదు సూర్యరశ్మి వలన చర్మం దెబ్బతిన్నట్లు అయితే ఆ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సి చాలా బాగా పనిచేస్తుంది. అందుకే పులుపు జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి అని చెబుతారు వైద్యులు..
2. విటమిన్ బి:
శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ ఇది. చర్మం, గోర్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ బి తప్పని సరిగా మన శరీరంలో ఉండాల్సిందే. చర్మం పొడిబారినట్లు అవ్వడం, జుట్టు అధికంగా రాలిపోవడం, చర్మం దురదలు రావడం వంటి సమస్యలను విటమిన్ బి దూరం చేస్తుంది. అంతేకాదు శరీరంలో చర్మకాంతి తగ్గినప్పుడు కూడా వైద్యులు విటమిన్ బి కాంప్లెక్స్ తీసుకోమని సలహా ఇస్తూ ఉంటారు.
3. విటమిన్ ఎ:
పాలకూర, క్యారెట్, గుడ్డు సొనలు , చేపలు, మొదలైనవి విటమిన్ ఎ యొక్క గొప్ప వనరులు అని చెప్పవచ్చు. చర్మాన్ని పునరుద్ధరించడానికి విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది. కాబట్టి విటమిన్ ఎ తప్పనిసరిగా ఉపయోగించాలి.