చుండ్రు కారకాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya

సాధారణంగా ఎవరికైనా సరే జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి మహిళ కోరుకున్నట్టుగానే పురుషులు కూడా తమ జుట్టును కొద్దిగా స్టైలిష్ గా మార్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పోతే ఈ చుండ్రు సమస్య వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ.. ఇక ఈ సమస్యలు తొలగించుకోవడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ముందుగా మనం ఈ చుండ్రు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటే చుండ్రు సమస్య రాకుండా చేయగలము. సాధారణంగా ఈ సమస్య వచ్చిన తర్వాత దానికి మార్గాలు వెతుక్కోవడం కన్నా వచ్చిన సమస్య ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా శీతాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చుండ్రు రావడానికి గల కారణాలేమిటో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. తలస్నానం చేయకపోవడం:
చాలామందికి తలస్నానం చేయడం అంటే చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది . అందుకే వాళ్ళు కేవలం వారానికి ఒకసారి మాత్రమే తల స్నానం చేస్తారు . అయితే తలస్నానం చేయకపోవడం వల్ల పర్యావరణం లో ఉండే దుమ్ము, ధూళి అన్ని జుట్టు పై  పేరుకుపోయి, ఫలితంగా చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వారానికి కనీసం రెండు సార్లయినా శుభ్రంగా తలస్నానం చేయడం మంచిది.
2. షాంపూలను సరిగ్గా కడగకపోవడం:
సాధారణంగా చాలామంది ఎక్కువ షాంపూ తో తలస్నానం చేస్తూ ఉంటారు..ఇలా చేయడం వల్ల స్కాల్ఫ్  మీద షాంపూ పేరుకుపోయి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది . ఫలితంగా చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి షాంపూ తో స్నానం చేసినప్పుడు శుభ్రంగా షాంపు తొలగిపోయే వరకు స్నానం చేయండి.
3. ఫంగల్ ఇన్ఫెక్షన్:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇతరులతో దువ్వెన పంచుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందట. తరచూ తలస్నానం చేయకపోవడం, తలపై చెమట పేరుకుపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.. కాబట్టి ఇతరులతో దువ్వెనలు, టవల్ లాంటివి పంచుకోవద్దు.

ఇక ఆహారపు అలవాట్లు, వేడి నీటితో స్నానం చేయడం ఇలాంటి కారణాల వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: