"ఐ లైనర్" వాడుతున్నారా... ఇవి తెలుసుకోండి?
ఐ లైనర్ అనేది మేకప్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఐలైనర్ అనేది కాస్త ఎక్కువైనా లేదా అటూ ఇటూ అయినా ఇక అంత సేపు చేసిన మేకప్ మొత్తం పాడైపోతుంది. అయితే ఐలైనర్ లైన్ దాటి పక్కకు పోకుండా ఎలా చేసుకోవాలి. ఐలైనర్ ను ఎలా పెట్టుకుంటే మీ కళ్ళకు మరింత అందం పెరిగి మీ ముఖం మరింత అద్భుతంగా కనిపిస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పట్లో ఫ్యాషన్ కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మేకప్ కిట్స్, జువెలరీ కలెక్షన్ ఇలా అందానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ పలు రకాల బ్రాండ్ లలో, ప్రైజ్ లలో దొరుకుతున్నాయి. అదే విధంగా ఐలైనర్ లు కూడా మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు లభిస్తున్నాయి. అయితే కంటికి నచ్చింది కదా అని ఏది పడితే అది కొనకూడదు. ఎందుకంటే కన్ను చాలా సున్నితమైన భాగం అలాగే ఐ లైనర్ కంటికి వేసుకోవాల్సిందే కాబట్టి.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
మేకప్ వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం. కంటి కింది భాగంలో కన్సీలర్ ను పూసుకోవడం వలన కంటి కింద ఉండే మచ్చలు, డార్క్ నెస్ తగ్గుతాయి. అంతేకాకుండా కళ్లు పెద్దవిగా విచ్చుకున్నట్లు అందంగా కనిపిస్తాయి.
అలాగే ఐలైనర్ కంటికి వేసుకునే ముందు కన్సీలర్ ను రాసుకోవడం ఉత్తమం. కాళ్ళకి కాజల్ లేదా జెల్ ఐలైనర్ వాడుతున్నారు అంటే మీ కళ్లకు ఖచ్చితంగా సూట్ అయ్యే ఐషాడో వేసుకోవాలి. అప్పుడే మీ కళ్ళు మరింత అందంగా మెరిసిపోతాయి. దీనివల్ల మీ కళ్ళకి అందం డబుల్ అవుతుంది. ఒకవేళ మీ కళ్ళు మరింత పెద్దవిగా...స్పెషల్ గా కనిపించాలి అనుకుంటే మీ కాళ్ళకి ఐలైనర్‌ను రెండు సార్లు కోటింగ్ ఇస్తే సరిపోతుంది. దానివల్ల మీ కనులు మరింత బ్రైట్‌గా అందంగా కనిపిస్తాయి.