మీ ముఖం నల్లగా ఉందా... నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందా?

VAMSI
తెల్లగా నిగనిగలాడే చర్మం ఉండాలి అని ఎవరికి మాత్రం అనిపించదు. మగవారికైనా ఆడవారికైనా అందం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ. అందుకే అందరూ అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ఫేస్ క్రీములు లోషన్లు వంటివి వాడుతుంటారు. తెల్లగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ముఖం ఎంత కళగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి తెల్లగా ఉన్నట్లయితే వారి ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే తెల్లగా అవడానికి ప్రతి ఒక్కరు తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు.. అలాంటి వారు ఒకసారి ఈ సహజమైన పద్దతులను వాడి చూడండి ఫలితం ఖచ్చితంగా చూస్తారు అంటున్నారు. అయితే ఓ సారి చూద్దాం.
చాలా మంది చిన్న పిల్లలకు కొబ్బరి నూనెను రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి చర్మంలోని తేమ పోయి పొడిబారకుండా ఉండడానికి, అలాగే జ్ఞానం మెరుగుపడుతుందని, ఇక్కడ మరొక కారణం ఏమిటంటే నూనెతో శరీరంపై బాగా మసాజ్ చేయడం ద్వారా పిల్లల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అయితే పెద్ద వారికి కూడా ఈ కొబ్బరినూనె  అందంగా కనిపించడానికి భలేగా ఉపయోగపడుతుంది. మీ ముఖంపై ఏమైనా మచ్చలు కానీ ఉన్నప్పుడు ఆ ముఖం ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఆ మచ్చలపై కొబ్బరి నూనె రాసి అలా ఓ అరగంట ఆగి శుభ్రం చేసుకోవాలి.  ఇది ఒక మాయిశ్చరైజర్ లా బాగా పని చేయడమే కాకుండా చర్మం మంచి రంగులోకి రావడానికి ఉపయోగపడుతుంది.
*అలాగే ఎండబెట్టిన నారింజ తొక్కలను మెత్తటి పొడిలా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. వారానికి మూడు సార్లు ఒక టీ స్పూన్ పౌడర్ లో కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. ఒక పదిహేను నిమిషాలు తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై మచ్చలు పోవడమే కాదు ముఖం తెల్లగా కాంతివంతంగా కూడా తయారవుతుంది.
మరి ఈ రెండు చిట్కాలను వాడి మీ ముఖాన్ని తెల్లగా మరియు అందంగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: