చుండ్రు సమస్యకి శాశ్వతంగా ఇలా చెక్ పెట్టండి..

Purushottham Vinay
ఇక చాలామందిని కూడా నిత్యం వెంటాడే సమస్య చుండ్రు అని చెప్పాలి. అమ్మాయిలైన అబ్బాయిలు అయినా కాని ఈ చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఈ సమస్యని ఎదుర్కుంటారు. వారు ఎన్ని షాంపులు వాడినా కాని ఎలాంటి ఫలితం అనేది వారికి ఉండదు. ఇక అలాంటి సమయంలో ఇంట్లో దొరికే కరివేపాకుతో ఈ సమస్యని చాలా పోగొట్టవచ్చు. ఇది వారి చుండ్రు సమస్యకు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఏ కూర తాలింపు వేసినా కాని అందులో ఖచ్చితంగా ఈ కరివేపాకు అనేది వుండాల్సిందే. ఇక మంచి సువాసన కలిగి ఆకుపచ్చని రంగులో వుండే ఈ కరివేపాకు అందరికీ కూడా బాగా అందుబాటులోనే వుంటుంది. ఇక అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఈ కరివేపాకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక అలాగే కరివేపాకుకి చుండ్రు ని తగ్గించే గుణం చాలా పుష్కలంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.ఇక కొన్ని కరివేపాకు ఆకులు అలాగే సమానంగా నిమ్మపండు తొక్క,శీకాకాయ ఇంకా పెసలు తీసుకోవాలి.ఇక అలా తీసుకున్న వాటిని అన్ని కలిపి బాగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ అనేది చేసుకోవాలి.ఇక ఇలా నిల్వ చేసుకున్న ఆ పొడిని ఒక షాంపూ లాగా వాడుకోవటం వల్ల ఇక వారం రోజుల్లోనే మీకు చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది.ఇక కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి ఆ ఆకులు బాగా నల్లగా మారేంత వరకు కూడా ఓ చిన్న మంట మీద వేడి చేసి ఆ తరువాత వడకట్టుకోవాలి. ఇక ఇలా వడకట్టుకున్న నూనెని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని మీ జుట్టుకి వాడుకోవటం వల్ల జుట్టు పెరుగుదలకు ఇంకా వెంట్రుకలు తెల్లబడకుండా ఉండటానికి బాగా సహాయపడుతుంది.ఇక ఎందుకు ఆలస్యం చుండ్రు సమస్యతో బాగా బాధ పడేవారు ఈ కరివేపాకుతో ఈ చిట్కాని పాటించండి. ఖచ్చితంగా చుండ్రు సమస్య తగ్గి మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: