పుదీనాతో ఇలా చేస్తే మొటిమలు రానే రావు..

Purushottham Vinay
పుదీనా ఆకుల చర్మానికి చాలా మంచివి. ఈ ఆకులలో సాలిసిలిక్ యాసిడ్ ఇంకా విటమిన్ ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటాయి.పుదీనా ఆకు అనేది చర్మంలో సెబమ్ స్రావాన్ని బాగా నియంత్రిస్తుంది. ఇక జిడ్డుగల చర్మం ఉన్నవారికి అయితే మొటిమలు వచ్చే అవకాశం చాలా ఉంది. పుదీనా ఆకుల యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు మంటను బాగా నివారిస్తాయి. ఇంకా అలానే పుదీనా ఆకు మొటిమలను వెంటనే నయం చేస్తాయి. ఇక మీరు చేయాల్సిందల్లా పుదీనా ఆకులను మొటిమలపై బాగా రుద్ది, అది బాగా ఆరిపోయే వరకు కూడా ఒక 15 నిమిషాలు అలాగే ఉంచాలి.ఇక ఇది మొటిమలను ఇంకా అలాగే మచ్చలను చాలా తొలగిస్తుంది. ఇంకా అలాగే చర్మ రంధ్రాలను కూడా మూసి వేసి బాగా శుభ్రపరుస్తుంది.ఇక పుదీనా ఆకులలో వున్న బలమైన శోథ నిరోధక లక్షణాలు కోతలు, గాయాలు, దోమ కాటు ఇంకా చర్మ దురదను నయం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి.

మీరు పుదీనా ఆకు సారాన్ని తీసి చర్మం ప్రభావిత ప్రాంతంలో దాన్ని అప్లై చేయాలి. ఇది గాయాలను త్వరగా నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే చర్మంలోని చికాకు ఇంకా మంటను కూడా చాలా ఈజీగా నయం చేస్తుంది.ఇక పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద నల్లటి వలయాలను తొందరగా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి.ఇక ఇది చాలా సులభమైన ప్రక్రియనే చెప్పాలి. ఇక ఇందుకు మీరు చేయాల్సిందల్లా పుదీనా ఆకుల పేస్ట్‌ని కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలపై రాసి రాత్రిపూట అలాగే ఉంచాలి. ఇక ఇది కళ్ల కింద చర్మం రంగును వెంటనే తగ్గిస్తుంది. అలాగే నల్లని మచ్చలను కూడా వెంటనే తగ్గిస్తుంది.ఇక అలాగే చర్మంలోని రంధ్రాలకు అడ్డుపడే మురికిని కూడా పుదీనా ఈజీగా తొలగిస్తుంది. అలాగే సూక్ష్మక్రిములు అనేవి కూడా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఇక మొటిమల రూపాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల మొటిమ అనేది చర్మం పై రాగానే త్వరగా నయమవుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది. అలాగే మచ్చలను కూడా తొలగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: