చర్మ సౌందర్య కాపాడుకోడానికి ఇవి తినండి..

Purushottham Vinay
ఇక చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేసే మంచి కొవ్వులు డ్రైఫ్రూట్స్‌లో చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్‌ స్ట్రేస్‌ కలిగించే అనేక రకాల హానికారకాల నుంచి మన చర్మాన్ని ఈజీగా కాపాడుతుంది.అందుకే ఒక స్పూన్‌ లేదా గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ ను ప్రతిరోజూ కూడా తినడం వల్ల ఎక్కువ క్యాలరీలు అందడమే కాకుండా మీ శరీర కాంతి కూడా మెరుగుపడుతుంది.
ఇక సోయలో కూడా ప్రొటీన్లు అనేవి చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇక దీనిలోని ఐసోఫ్లేవోన్స్‌ కొల్జాజెన్‌ను కాపాడి చర్మం పైన వుండే ముడతలను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అందుకే సోయ పాలు లేక టోఫు ఏ విధంగా తీసుకున్న కాని చర్మ ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇంకా చర్మం చాలా సౌందర్యంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక టమాటాల్లో కూడా విటమిన్‌ ‘సి’, ఇంకా లైకొపీన్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు అనేవి కనిపించకుండా చేసి చాలా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఇక టమాటాలను బాగా ఉడికించి క్రీమీ పేస్ట్‌లా లేక తక్కువ నూనెలో వేయించి అయినా తింటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది.
ఇక చేప కూడా చర్మానికి చాలా మంచిది.చేపలో ఒమేగా-3 కొవ్వులు చాలా పుష్కలంగా ఉంటాయి. ఐతే ఇవి నాచురల్ గా శరీరంలో ఉత్పత్తి కావు. చర్మం పై పొర ఆరోగ్యానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ చర్మం ఎల్లప్పుడూ తడిగా ఉండి సౌందర్యవంతంగా ఉంటుంది.
ఇక గుడ్లు కూడా చర్మ సంరక్షణకు ఇంకా సౌందర్యానికి చాలా మంచివని చెప్పాలి.సల్ఫర్‌ ఇంకా లూటీన్‌ అనేవి గుడ్డులో చాలా అధికంగా ఉంటుంది.ఇవి చర్మాన్ని చాలా మృధువుగా ఇంకా చాలా చెమ్మగా ఉంచుతాయి. ఇక మనం కొడి గుడ్లని అల్పాహారంలో లేదా ఇతర ఏ పద్దతుల్లో తిన్నా చర్మానికి చాలా మంచిదే.కాబట్టి గుడ్లని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: