పాదాల పగుళ్లు మిమ్మల్ని బాధిస్తున్నాయా ?

VAMSI
చాలా మంది పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం వీరు ఎక్కువగా నీటిలో తిరగడమే. పాదాల పగుళ్లు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాగే మహిళలు నీటిలో ఎక్కువగా తిరగడం వలన, సబ్బు నీటిలో ఎక్కువ సమయం ఉండటం వలన కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఇది పెద్ద అనారోగ్య సమస్య కానప్పటికీ అంత చిన్న విషయమేమీ కాదు. చాలామందికి ఈ కాళ్ళ పగుళ్ళ నుండి రక్తం కారుతుంది. కొందరికి ఈ పగుళ్ళ కారణంగా నొప్పి ఎక్కువై అసలు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 

అంతే కాదు పాదాలు కూడా అసహ్యంగా కనబడుతుంటాయి. అయితే ఈ పాదాల పగుళ్ళ సమస్య నుండి బయటపడేందుకు ఈ రెండు చిట్కాలను పాటించమని సలహా ఇస్తున్నారు కొందరు చర్మ వ్యాధి డాక్టర్లు.  
* పాదాల పగుళ్లు తగ్గే వరకు రోజు ఒక పది నిముషాలు మీ పాదాలను వేడి నీటిలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభించడమే కాకుండా, పగుళ్ల మధ్య ఏమైనా మట్టి కణాలు ఉంటే తొలగిపోతాయి.
* పాదాల పగుళ్లు ఎక్కువగా దురద పెడుతూ ఇబ్బంది పెడుతున్నాయా, అయితే ఒక చిన్న గిన్నె నుండి వేపాకు తీసుకుని మొదట మెత్తటి పేస్టులా చేసుకోవాలి. అందులో రెండు, మూడు టీ స్పూన్ల పసుపు వేసి బాగా  కలపాలి. ఇక ఈ పేస్టును ఇప్పుడు పగుళ్లపై రాస్తే సరి. ఇలా కనీసం ఒక గంటపాటు ఉంచాలి. అనంతరం కొద్దిగా వేడి నీటితో పాదాలను శుభ్రపరుచుకొని మంచి శుభ్రమైన బట్టతో తుడుచుకోవాలి. ఈ రెండు చిట్కాలు పాదాల పగుళ్ల నుండి ఏర్పడిన నొప్పిని అలాగే పగుళ్లను దూరం చేయడానికి మీకు సహాయ పడతాయి. ఇదే విషయాన్ని మీ స్నేహితులకు మరియు బంధువులకు కూడా తెలియచేసి వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: