ఈ ఐటమ్స్ తింటే అందం మీ సొంతం...

VAMSI
మాములుగా అమ్మాయిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు. ఆరోగ్యంగా ఉండాలని, అందమైన ముఖంతో సౌందర్యంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరికి వీలైనంతలో వారు తమ అందాన్ని కాపాడుకోవడానికి, మరింత మెరుగ్గా కనిపించడానికి ఫేస్ ప్యాక్ లని, క్రీమ్ లని, సన్ స్క్రీన్ లోషన్లు అని ఇలా చాలానే వాడుతుంటారు.  సీజన్లను బట్టి రకరకాల ఫేస్ క్రీములు వాడుతుంటారు.  అయితే నీళ్ళు మారడం వలన కావొచ్చు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వలన కావొచ్చు మన ముఖం రంగు తగ్గడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటి సమస్యలు రావడం చూస్తుంటాం.
అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మనము తరచూ మన రెగ్యులర్ ఫుడ్ లో అలవాటు చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాదు, చర్మానికి మెరుపును అందించి ముఖం నిగనిగలాడుతూ అందంగా కనిపించడానికి సహాయపడుతాయట ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* క్యారెట్ చర్మం కాంతి వంతంగా కనిపించడానికి, మంచి రంగుకు చాలా బాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


*ఓట్స్, తేనె వంటి మాయిశ్చరైజింగ్ పదార్థాలు కూడా చర్మ సౌందర్యానికి చక్కగా ఉపయోగపడతాయి.


*పాల కూర కూడా చర్మం అందంగా కనిపించడానికి, చర్మ రక్షణకు బాగా పనిచేస్తుందట.  చర్మంలో తేమను పెంచుతాయి. పాలకూరలో ఉండే ఎ, బీటా కెరోటిన్ లు అధిక మొత్తంలో ఉండటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా చేస్తాయి.


*బొప్పాయి కూడా ఆరోగ్య వంతమైన చర్మానికి చాలా మంచిది  ఇందులో  విటమిన్-C, E, బీటా కెరోటిన్ కి పుష్కలంగా ఉండటం వలన చర్మం రంగును పెంచి, మెరిసేలా చేస్తాయి.


* చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్‌‌ అధికంగా ఉంటాయి. ఇవి చర్మం  మృదువుగా మారడానికి అందంగా కనిపించడానికి బాగా పని చేస్తాయి.
మరి మీరు కూడా పైన చెప్పిన విధంగా ఆహారాన్ని తీసుకుని అందంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: