"అందంగా లేరా.... అసలేం బాలేరా" ఈ టిప్స్ మీ కోసమే ?

VAMSI
ఈ ప్రపంచంలో అందమైనవి రెండే రెండు. ఒకటి అమ్మాయిలు.. రెండు కూడా అమ్మాయిలే. ఎందుకంటే అమ్మాయిలు అనగానే అందం గుర్తొస్తుంది. అమ్మాయిలకు అందంపై సహజం గానే కాస్త ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపించాలని, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని ఎంతగానో ఆశపడుతుంటారు చాలా మంది మహిళలు. ముఖ్యంగా ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటుంటారు చాలా మంది. అయితే మనం అనుకున్న విధంగా అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలి అంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగానే ఫెయిర్ గా ఉన్న వారైతే డార్క్ కలర్  బట్టలను ఎంచుకోవాలి. అదే విధంగా, రంగు కాస్త తక్కువగా ఉన్న వారైతే లైట్ కలర్ డ్రెస్సులను ఎంచుకోవాలి. అలాగే డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్, బ్యంగిల్స్, హ్యాండ్ బ్యాగ్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు శారి కట్టుకున్నట్లయితే ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం, జీన్స్ అండ్ మోడ్రన్ డ్రెస్సులు మీద కైతే మోడల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం , అలాగే బ్యాంగిల్స్ కాకుండా ఏమైనా హ్యాండ్ బ్యాండ్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అయితే అందరి దృష్టిని ఆకర్షించేంత అందంగా కనిపించాలంటే ఇవన్నీ తప్పక పాటించాల్సిందే మరి. అలాగే మీరు ధరించే చెప్పులు  కూడా కరెక్ట్ మ్యాచ్ అయ్యేలా ఉంటే మంచిది.
హైట్ కాస్త తక్కువ ఉన్న వారైతే కాస్త ఇబ్బందిగా ఉన్నా అలవాటు చేసుకుని మరీ హై హీల్స్ ను ధరిస్తే బాగుంటుంది.
ఇక కాస్త లావుగా ఉన్నవారు లాంగ్ స్కర్ట్స్ ను ఎంచుకోవడం మంచిది. ఇలా ప్రతి ఒక్కరు చక్కగా మ్యాచ్ అయ్యేలా చూసుకుని, అవి తమకు మ్యాచ్ అవుతాయా లేదా అన్న ట్రైల్ ఒకసారి చూసుకుని రెడీ అయితే అందరిలోను ప్రత్యేకంగా కనిపిస్తారు. మీకు ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. మరి ఈ రోజు నుండి మీరు కూడా అందంగా అందరినీ ఆకర్షించడానికి పైన మనము చెప్పుకునే విధంగా తయారు అవ్వడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: