మీ మెడ తెల్లగా మెరవాలంటే ఇలా చేయండి ?

VAMSI
సాధారణంగా యువతీ యువకులు శరీర అందం మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తూ ఉంటారు. మరీ అమ్మాయిల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం అందం మీదనే ధ్యాస ఉంటుంది. కానీ ఇక్కడ అందం అంటే మీ ముఖం ప్రకాశవంతంగా మెరవడం. దీనికి ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. స్నేహితులు చెప్పిన అనేక చిట్కాలను పాటిస్తూ ఉంటారు. కానీ కొంత మంది అమ్మాయిలకు ముఖం అందంగా ఉన్నా మెడ దగ్గర ముందు మరియు వెనుక భాగంలో నల్లగా ఉంటుంది. కారణం తెలియకపోయినా అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అలా మెడ భాగంలో నల్లగా ఉండడం పోయి మెడ ప్రకాశ వంతంగా మెరవాలంటే ఒక చిన్న చిట్కాను పాటించండి.
ఒక రెండు నిమ్మ చెక్క ముక్కలు తీసుకుని ముందుగా ఒక పది నిముషాల పాటుగా గోరు వెచ్చని నీటిలో ముంచి పెట్టండి. ఆ తర్వాత మీరు స్నానం చేసే ముందు, ఆల్రెడీ ముందుగా ఉంచుకున్న  రెండు నిమ్మ చెక్క తీసుకుని మీ మెడపి ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడంతా స్క్రబ్బింగ్ ఎలా చేస్తారో ? ఆ విధంగా  మెడ పైన నిమ్మ చెక్కతో నెమ్మదిగా రుద్దండి. అలా రెండు సార్లు చేశాక..ఒక అయిదు నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడగండి. అలా ఒక 10 రోజుల పాటు చేయండి. తేడా మీరే  చూస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరికైనా మెడ భాగంలో నల్లగా ఉంటే ఈ చిట్కాను ట్రై చేయండి.
ఈ చిట్కాను పాటించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిమ్మ చెక్క ముక్కను లేతగా ఉండేలా చూసుకోవాలి.  ఇంకా మీరు నిమ్మ ముక్కతో మెడపై రుద్దే సమయంలో మీకు ఎక్కువ మంట అనిపిస్తే ఆపేసేయండి. ఇలా మీ మెడ భాగంలో మంట కలిగితే వెంటనే ఆ ప్రయోగాన్ని ఆపేయడం మంచిది. అంటే మీ శరీరానికి నిమ్మకాయ పడదు అని అర్థం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: