అందమైన జుట్టు, కనుబొమ్మల కోసం ఇలా చెయ్యండి..

Purushottham Vinay
అందమైన ముఖంతో పాటు అందమైన జుట్టు కూడా చాలా అవసరం. అందమైన జుట్టుకి కలబంద చాలా చక్కగా పని చేస్తుంది.అలోవేరా జెల్ ను వాడడం వలన చర్మ సౌందర్యంతో పాటు మన జుట్టు సమస్యలను కూడా చాలా సులభంగా దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అసలు అలోవేరా జెల్ ఉపయోగించడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. అలోవేరా జెల్ మన జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంగా పని చేస్తుంది. ఈ జెల్ ని వాడడం వలన అనేక రకాల జుట్టు సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా మంచి అందమైన జుట్టుని పొందవచ్చు.దీన్ని జట్టుకు అప్లై చేసినపుడు మంచి నిగారింపు అనేది వస్తుంది.అలాగే అప్లై చేసిన తరువాత దీనిని కడుక్కోవడం కూడా చాలా తేలికైన పని. మీ జుట్టు డ్రై,  రఫ్గా ఉన్నట్లుఅయితే అప్పుడు అలోవేరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వలన ఇలాంటి సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి సమస్యలు ఎప్పటికి రాకుండా అలోవేరా జెల్ మన జుట్టును బాగా కాపాడుతుంది.

ఈ జెల్లో ఉండే ప్రోటో యోలైటిక్ ఎంజైమ్ లు మన తలమీద ఉన్న డెత్ స్కిన్ సెల్స్ ను బాగా సరి చేస్తాయి. అందుకే అలోవేరా జెల్ ను జుట్టుకు బాగా మసాజ్ చేసి ఒక 30 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత జుట్టును బాగా కడుక్కోవాలి. ఇలా జుట్టుని కడుక్కున్న తర్వాత మన జుట్టు చాలా స్మూత్ గా వుండే ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఈ విధంగా జుట్టుకు కలబంద రాసుకునే ముందు తేనె, ఆలివ్ ఆయిల్ ఇంకా పెరుగులను కూడా అలోవేరా జెల్ కు కలుపుకోని రాసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వలన వెంట్రుకలు కుదుళ్ల నుంచి కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇక ఈ ద్రావణాన్ని మన జుట్టు మీద అప్లై చేసుకుని ఒక 30 నిమిషాల పాటు మన జుట్టు మీద అలాగే ఉంచుకుంటే చాలా ఒత్తుగా ఉంటుంది. అలాగే మన కనుబొమ్మలపై కూడా అలోవెరా జెల్ ని ఉపయోగిస్తే ఎంతో అందంగా ఒత్తుగా ఉంటాయి.కాబట్టి ఈ పద్ధతులను పాటించండి. అందమైన జుట్టుని, కనుబొమ్మలని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: