ఎత్తు పళ్ళు వారు అందంగా కనపడాలంటే ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఇక అందంగా కనపడాలంటే అందమైన చిరునవ్వు అనేది చాలా అవసరం. అందమైన చిరునవ్వు లేకుంటే ఎంత అందమున్నా వేస్ట్ అని చెప్పాలి. చాలా మంది కూడా ఎత్తు పళ్లతో చాలా అందవిహీనంగా కనపడుతూ వుంటారు. అలాంటి వారు బ్రేసెస్ వాడటం చాలా మంచిది. ఎందుకంటే దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయని డెంటిస్ట్ అంటున్నారు.ఇక కొంత మందికి అయితే పళ్ళు విరిగిపోయి ఉంటాయి.వాళ్ళు చాలా అందవిహీనంగా కనిపిస్తారు. ఇక అటువంటి వాళ్ళకి బ్రేసెస్ వేస్తారు. బ్రేసెస్ వేయడం వల్ల చక్కగా నవ్వచు. అదే విధంగా ఎప్పుడూ విరిగిపోయిన పళ్ళ వల్ల అనేక ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి.అలాగే పళ్ళ మధ్యలో ఎక్కువ ఆహారం ఇరుక్కుపోవడం కూడా జరుగుతుంది. దీని వలన బాగా చెడు శ్వాస కలగడం ఇంకా నోటి దుర్వాసన ఇలా ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి. ఇది సమయానుసారం బాగా ఎక్కువై పోతుంది.

అయితే రెండు పళ్ళ మధ్య కూడా చోటు అనేది లేక పోవడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ఇలా పళ్లకి బ్రేసెస్ వేసి డెంటిస్ట్ ఈ ప్రాబ్లెమ్ ను పరిష్కరించడం జరుగుతుంది. ఇక దీనితో మీరు ఇటువంటి సమస్యలకు చాలా దూరంగా ఉండొచ్చు అని డెంటిస్ట్ తెలపడం జరిగింది.ఇక ఒకవేళ కనుక పళ్ళు బాగా చిన్నగా ఉంటే అప్పుడు పంటికి పంటికి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.ఇక ఈ గ్యాప్ వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పళ్ళు పాచి పట్టడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. డెంటిస్ట్ మీ పళ్లకి బ్రేసెస్ వేస్తే అప్పుడు ఆ గ్యాప్ అనేది మీకు పూర్తిగా మూసుకుపోతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్లు కూడా బ్రేసెస్ ని వాడితే చాలా మంచిది. ఎందుకంటే దీంతో సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు.కాబట్టి బ్రేసెస్ వాడండి. అందమైన పళ్ళని చిరునవ్వుని సొంతం చేసుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: