సన్ టాన్ పోగొట్టడానికి ఈ టిప్స్ పాటించండి..

Purushottham Vinay
ఇక పెరుగులో ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి ఇంకా పసుపు చర్మం టోన్ బాగు చేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి కలపండి. దీన్ని బాగా కలపండి ఇంకా ఆ మిశ్రమాన్ని మీ చేతుల్లో బాగా రుద్దండి.ఇక దీన్ని సుమారు 20 నిమిషాలు అలాగే ఉంచి తరువాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి.ఇక నిమ్మరసంలో వుండే విటమిన్ సి చర్మ కణాలను యువి కిరణాల నుండి రక్షిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీటిని తీసుకొని అందులో నిమ్మరసం బాగా పిండి, తరువాత చేతికి అప్లై చేసి15 నిమిషాలు పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక నిమ్మకాయలోని ఆమ్లత్వం మీ చర్మాన్ని బాగా పొడిగా చేస్తుంది కాబట్టి మంచి మాయిశ్చరైజర్ వేయడం అసలు మర్చిపోవద్దు.

ఇక బాదంపప్పులో చర్మాన్ని రక్షించే విటమిన్లు అనేవి పుష్కలంగా ఉన్నాయి.ఒక 5 నుండి 6 బాదం పప్పులు తీసుకొని వాటిని రాత్రిపూట బాగా నానబెట్టండి. ఇక పేస్ట్ ను తయారు చేయడానికి బాదంపప్పును కొద్దిగా పాలతో బాగా కలపండి.ఇక ఈ పేస్ట్‌ను అప్లై చేసి ఇంకా రాత్రిపూట వదిలి శుభ్రమైన నీటితో బాగా శుభ్రం చేసుకోండి.ఇక 2 టీస్పూన్ల గంధపు పొడి అలాగే పసుపు పొడిని తీసుకొని బాగా కలపాలి. దీనికి 2 నుండి 3 చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకొని మందపాటి పేస్ట్ తయారు చేసుకోండి.ఇక ఈ పేస్ట్‌ను మీ చేతులకు అప్లై చేసి ఒక 30 నిమిషాలు అలా వదిలివేయండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో బాగా శుభ్రం చేసుకోండి. ఇక ఈ పేస్ట్ మీ ఛాయను మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే దెబ్బతిన్న ప్రాంతాలకు చికిత్స అనేది చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: