ఉల్లి లో ఉండే ఏ రసాయనాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి..?

Divya
సాధారణంగా పొలంలో ఏదైనా పంట పెట్టాలి అనుకున్నప్పుడు, ఆ పొలంలో ఎరువు వేస్తే పొలం బాగా ఎదుగుతుంది.. మంచిగా కాపునిస్తుంది. చెట్టు స్పీడ్ గా ఎదిగి ,త్వరగా కొత్త కొమ్మలు, కొత్త చిగుర్లు  వచ్చి, కాండం దృఢంగా తయారవుతుంది. ఇక పొలంలో ఎరువు వేస్తే మొక్క ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతేవేగంగా  జుట్టు కూడా పెరిగితే చాలా బాగుంటుంది అని చాలా మంది కోరిక  కూడా.. మరి అలాంటి జుట్టుకు, పొలానికి ఎరువు వేసినట్టుగా జుట్టు కూడా ఒత్తుగా పెరగాలంటే , అందుకు ఉల్లి సహకరిస్తుంది. సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. ఈ ఉల్లిలో ఉండే కొన్ని రసాయనాల సమ్మేళనాల వల్ల, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఉల్లిని  జుట్టుకు ఎలా ఉపయోగించాలి..? దీని వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనే విషయాలను తెలుసుకుందాం..
ఇక ఈ ఉల్లి పేస్టుని తల మాడుకు పట్టించడం వల్ల, అక్కడ రక్తనాళాలు సరఫరా బాగా జరుగుతుంది. ఉల్లిపాయలో ఉండే " క్యాంపీఫెరాల్ అలాగే క్వర్సెటిన్" అనే రసాయనాలు జుట్టు కుదుళ్ళకు ఉండే రక్తనాళాలు వ్యాకోచం చెందేలా చేస్తాయి. అంటే రక్తనాళాలు వెడల్పు అయ్యేందుకు ఈ రసాయనాలు సహాయపడతాయన్నమాట. ఇక ఈ రక్తనాళాలు తెరుచుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితం జుట్టు రాలే సమస్య దూరం అవడంతో పాటు జుట్టు మీద ఏర్పడే చుండ్రు, రసాయనాల నుండి జుట్టును సంరక్షించుకోవచ్చు.

ఉల్లిపాయలలో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఘాటుకి తట్టుకోలేక, మనకు కళ్ళ వెంట , ముక్కు వెంట నీళ్లు రావడం సహజం. ఇక ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ ను జుట్టుకు పట్టిస్తామో , అప్పుడు జుట్టు కుదుళ్లలో వుండే కెరటోనాయిడ్స్ ఉత్పత్తిని, ఈ సల్ఫర్ వేగవంతం చేస్తుంది. ఫలితంగా కెరటిన్ కలిగిన జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే  యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉల్లిపాయలో ఉండటం వల్ల, జుట్టు కుదుళ్ల మీద ఏర్పడే ఫంగస్ లేదా బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: