స్కిన్ ఆందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల బ్యూటీ టీప్స్ పాటిస్తే చాలు.. స్కిన్ చాలా సాఫ్ట్ గా మారుతుందట. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి. క్రమం తప్పకుండా పాటించండి.బయట దొరికే క్రీమ్ లు, ఎటువంటి మేకప్ లు లేకుండా..చాలా న్యాచురల్ గా అందంగా కనిపించేందుకు ఇటాలియన్ బ్యూటీ సీక్రెట్స్ ఫాలో కావాలట. ఇటాలియన్స్ తమ స్కిన్ ని చాలా అందంగా ఉంచేందుకు అనేక పద్దతులు అనుసరిస్తారట. అక్కడ అందరి చర్మం చాలా సాఫ్ట్ గా ..న్యాచురల్ అందంతో కలిసి ఉంటుందట. మరి వాళ్లు అంత న్యాచురల్ గా అందంగా ఉండటానికి ఏం చేస్తారో తెలుసుకోండి.మన స్కిన్ ప్రతిరోజూ తేమగా ఉండేందుకు మనం రోజు మాయిశ్చరైజర్ రాసుకుంటాం. అయితే... వాళ్లు మాత్రం మాయిశ్చరైజర్ గా ఎలాంటి క్రీములు రాయకుండా స్కిన్ కి ఆలివ్ ఆయిల్ వాడతారట.
ఆలివ్ ఆయిల్ ని ఇటాలియన్స్ గోల్డ్ ఆఫ్ గాడ్ గా భావిస్తారట.ఇక ఈ ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఏజినింగ్ కాంప్లెక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ప్రతిరోజూ ఆలివ్ ఆయిల్ తో స్కిన్ ని మసాజ్ చేసుకోవాలట. అలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే.. స్కిన్ బాగా సాఫ్ట్ గా అయ్యి మీ ముఖంలో గ్లో పెరుగుతుందట.ఇక ఇటాలియన్స్ ఫేస్ స్క్రబ్బర్ గా స్ట్రాబెర్రీస్ ని ఉపయోగిస్తారట. ఇది చర్మం సాఫ్ట్ గా, ఇంకా ఎంతో అందంగా మార్చేందుకు సహకరిస్తుందట.ఇక 4-6 స్టాబ్రెర్రీస్ ని తీసుకొని వాటిని పేస్టులాగా చేసి.. అందులో ఒక స్పూన్ షుగర్ ఇంకా ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలట. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్థన చేయాలి. ఇలా రోజు కూడా ముఖానికి బాగా చేయడం వల్ల చాలా అందంగా ఇంకా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారట.కాబట్టి ఈ పద్ధతులు మీరు పాటించండి.మీ స్కిన్ ని బాగా సాఫ్ట్ గా చేసుకోండి.