పులిపిరులను తగ్గించే ఇంటి చిట్కాలు..

Purushottham Vinay

పులిపిరి సమస్య చాలా మందిని పట్టి పీడిస్తుంది. ఈ సమస్య అసలు వస్తే పోదు. అసలు పులిపిరిలు ఎలా వస్తాయంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. ఇంటి చిట్కాలు లేదా వైద్యులను సంప్రదించి వీటిని మటుమాయం చేయొచ్చు.ఇక పులిపిరులు తగ్గే ఇంటి చిట్కాల గురించి తెలుసుకోండి. మీరు వాటిని పాటించండి.



అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది.చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు మీరు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు.

కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు. ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.యాపిల్ సిడర్ వెనిగర్లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా పూర్తిగా మాయమవుతాయి.తాజాగా ఉండే పైనాపిల్ ముక్కలను పులిపిరికాయల మీద అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: